వాస్తు పూజాకాల నిర్ణయము
ఇత్యుక్త్వాంతర్దధో సద్యోదేవో బహ్మవిదావరః |
వాస్తుపూజాం ప్రకుర్వీతగృహారంభే ||
ద్వారాభివర్తనే చై వత్రివిధే చ ప్రవేశనే |
ప్రతివక్షే చయజ్ఞా దౌతదాప త్ప్రస్యజన్మని ||
వ్రతబంధే వివాహేచ తధైవ చ మహోత్సవే |
జీర్ణోద్ధారే తధాశల్యనృనేచై వవి శేషతః ||
వజ్రాగ్నిదూషితే భగ్నే సర్పచాండాల వేష్టితే |
ఉలూకవాసితే సప్తరాత్రౌ కాకాధివాసితే ||
18-19-20-21. కాబట్టి గృహారంభకాలమునను, " అపూర్వ, సుపూర్వ ద్వంద్వభయాది త్రివిధగృహప్రవేశ సమయములందును, ద్వారీభివర్తనమునందును, ప్రతి సంవత్సరారంభమునను, యజ్ఞాదియందును, పుత్రైజన్మమునందును, ఉపనయన కాలమునందును, వివాహసమ యమునను, మహోత్సవాదులందును, జీర్ణోద్ధారమునందును, శల్యవిన్యాస సమయమునను, పిడుగుపడునప్పుడును, అగ్ని దగ్ధమైనను, పడిపోయినను
సర్పచండాలదూషితయైనను,
శ్లో. మృగాధివాసి తేరాత్రౌ గోమార్జారాభినాదితే
వారణాశ్వాదివిరులేస్త్రీణాం యుద్ధాభిదూషితే.
కపోతకగృహావాసే మధూనాం నిలయేతధా
ఆన్యైచ్చైవ మహోత్పాతైర్ధూషితే శాంతిమాచరేత్.
22.23. గుడ్లగూబ ప్రవేశించినయెడలను, యేడురాత్రులు కాకి నివసించియున్నను, మృగములు గృహమున నినపించినను, గోమార్జాలాదుల ధ్వనిగల గృహమునను, ఏనుగులు, గుఱ్ఱములు విరుద్ధమగురుత మొనర్చినచోటను, స్త్రీలయుద్ధము చేత దూషితమైన యింటను, పావురములు చేరినయింటను, తేనెపట్టు పట్టినగృహమునను, మరెట్టి ఉత్పాతములైన పుట్టినయింటను, తచ్ఛాంతికొరకు వాస్తుపురుషుని పూజింపవలెను.