రాజస్థాన్ లోని సోడాలదూడలో భారీ ఎత్తున ఘర్ వాపసీ జరిగింది. సుమారు 80 కుటుంబాలు తిరిగి సనాతన ధర్మాన్ని స్వీకరించాయి. అలాగే సోడాలదూడలోని చర్చిని కూడా వీరు భైరవ మందిరంగా మార్చేశారు. మాజీ పాస్టర్ గౌతమ్ గరాసియా ఈ ఘర్ వాపసీ ఉద్యమానికి నాయకత్వం వహించారు.
అయితే.. చరిత్ర ప్రకారం ఈ చర్చి 125 సంవత్సరాల క్రిందట కాల భైరవుని దేవాలయమే. కాల క్రమేణా క్రైస్తవ మిషనరీలు స్థానికుల్ని ప్రభావితం చేసి, మతం మార్చేశారు. ఈ ఆలయం కాస్తా.. చర్చిగా మారిపోయింది. చాలా సంవత్సరాల పాటు ఈ 80 కుటుంబాలు క్రైస్తవ కుటుంబాలే. ఈ దేవాలయం చర్చిగానే వుండిపోయింది. కానీ… ఈ కుటుంబాల్లో మార్పులు వచ్చి, అందరూ హిందూ ధర్మంలోకి తిరిగి వచ్చేశారు.
‘‘ముప్పై సంవత్సరాల క్రిందట ఈ గ్రామంలో క్రైస్తవంలోకి మారిన మొట్ట మొదటి వ్యక్తిని నేనే. కానీ.. నిజమైన సంప్రదాయం, విలువలు అన్నీ సనాతన ధర్మంలోనే వున్నాయని మెళ్లి మెళ్లిగా గ్రహించాను. మా అందర్నీ క్రైస్తవ మిషనరీలు తప్పుదారి పట్టించాయి. కానీ.. ఇప్పుడు మా మూలాలను మేము తెలుసుకున్నాం.. తిరిగి స్వధర్మంలోకి వచ్చేశాం’’ అని గౌతమ్ గరాసియా ప్రకటించారు.
ఇక.. ఇక్కడున్న చర్చిని దేవాలయంగా మార్చేశారు. దీనిపై కాషాయ రంగు వేశారు. క్రైస్తవ చిహ్నాలన్నింటినీ తొలగించారు.బైబిల్ ప్రసంగాలకు నిలయంగా వున్న ఈ చర్చి.. ఇప్పుడు భైరవ మూర్తి వచ్చేసింది. ఈ నెల 9 న తల్వారా నుంచి భైరవ మూర్తిని తీసుకొచ్చి, వేద మంత్రోచ్చారణల మధ్య ఊరేగింపుగా తీసుకొచ్చి, స్థాపించారు.భైరవుడే తమ సంరక్షకుడని, జరిగిన చారిత్రిక తప్పిదాన్ని సరిదిద్దుకుంటున్నామని గ్రామస్థులు తెలిపారు. గ్రామ ప్రవేశ ద్వారం వద్ద కూడా కాషాయ జెండాలు వచ్చేశాయి. దీంతో ఆ గ్రామంలో ఆధ్యాత్మిక వారసత్వం తిరిగి పొందింది.
దశాబ్దాలుగా సోడలదూదలో క్రైస్తవ మతం పాతుకుపోయింది. బలహీన వర్గాలను లక్ష్యంగా చేసుకొని, మత మార్పిడి జరిగింది. గరాసియానే మొట్ట మొదటగా మతం మారి, ఆ తర్వాత పాస్టర్ అయ్యాడు. క్రైస్తవ వ్యవహారాలన్నీ ఆయనే చూసేవాడు.గత సంవత్సరం 30 మంది సనాతన ధర్మంలోకి తిరిగి వచ్చేశారు. ఇప్పుడు 80 మంది తిరిగి వచ్చేశారు.