![]() |
Mahashivratri |
కంబదూరు మండల కేంద్రంలో వెలసిన శ్రీ కమల మల్లేశ్వర స్వామి దేవాలయంలో బుధవారం మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి ఉదయం నుంచి అభిషేకాలు చేశారు.
అనంతరం ప్రత్యేక పూలతో అలంకరించి స్వామివారికి పూజలు నిర్వహించారు. స్వామిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా కర్ణాటక ప్రాంతం నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పూజలు నిర్వహించారు. దేవాలయం భక్తులతో కిటకిట లాడింది.