కోటప్పకొండ శ్రీత్రికోటేశ్వర స్వామి ఆలయంతో పాటు పుణ్య క్షేత్రంలో కొలువుదీరిన దేవతామూర్తుల ఆలయాలు, విగ్రహాలకు రంగులు వేసి తీర్చిదిద్దారు. అన్నదాన సత్రాలను సిద్ధం చేశారు.
నరసరావుపేట నుంచి కోటప్పకొండకు వెళ్లే ప్రధాన మార్గంలోని చిలకలూరిపేట బ్రాంచి కాలువ ఒడ్డున కొత్తగా నిర్మించిన శివ కుటుంబం విగ్రహం పర్యటకులను ఆకర్షిస్తుంది. సోమవారం ఏకాదశి సందర్భంగా శివ కుటుంబానికి భారీ గజమాలతో అలంకరించి పూజలు చేశారు.