మహిళల ప్రతిష్ఠ గౌరవం, ఆప్యాయత, ప్రేమ మీదే ఆధారపడి వుంటుందని సాధ్వీ రితింభర అన్నారు. అంతే తప్ప ఫ్యాషన్ గా వుంటే రాదన్నారు.
మహాకుంభమేళాలో వీహెచ్ పీ శక్తి సమాగమం నిర్వహించింది. ఇందులో భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… మహిళలు పరధ్యానంలో వుంటే పతనం మాత్రం ఖాయమన్నారు. హిందూ సమాజంలో శౌర్య భావాన్ని మెల్కొల్పాల్సిన అవసరం వుందన్నారు. సమాజంలోని ప్రతి దానిలోనూ బలం, సంకల్పం వున్నప్పుడే దేశ నిర్మాణం దిశగా అడుగులు పడతాయన్నారు. దేశంలోని మహిళలందరూ హిందూ మూలాలను గుర్తించి, పంచ పరివర్తన్ అమలు జరిగేలా చూడాలన్నారు. పంచ పరివర్తన్ పై మహిళలందరికీ అవగాహన వుండాలని, ఇది ఇప్పటి కాలానికి అత్యావశ్యకమన్నారు.
Sadhvi Ritambhara |
దుర్గావాహిని జాతీయ కోఆర్డినేటర్ ప్రజ్ఞామహాల మాట్లాడుతూ భారతీయ మహిళలు ఎప్పటి నుంచో సమాజంలో స్ఫూర్తిదాయకంగా జీవిస్తున్నారని, దీనినే కొనసాగించాలన్నారు. మహిళలకుండే దూరదృష్టి, శక్తి, ఉత్సాహం, సంకల్పం అన్న గుణాలు సవాళ్లను ఎదుర్కొనేలా చేశాయన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రయాగరాజ్ కుంభమేళాలో సమాగమం నిర్వహించామన్నారు.