Kumbh Mela |
కుంభ మేళ అంటే ఏమిటి?
- మహా కుంభమేళ 144 సంవత్సరములు ఒకసారి
- పూర్ణ కుంభమేళా 12 సంవత్సరములకు ఒకసారి
- అర్థ కుంభమేళా 6 సంవత్సరములకు ఒకసారి
- కుంభమేళ 3 సంవత్సరం లో ఒకసారి
Kumbh Mela |
మహా కుంభ మేళ అంటే ఏంటి?
ప్రతి 12 యేళ్ళకు ఒకసారి నిర్వహించే ఈ ఆధ్యాత్మిక మహా మేళా విశేషాలను లోతుగా పరిశీలిస్తే.. కుంభం అనగా కుండ లేదా కలశం. భారతీయ ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభం అనేది ఒక రాశి (కుంభ రాశి). మేళా అంటే కలయిక లేదా జాతర. కుంభ రాశిలో నిర్వహించే ఉత్సవం కావడంతో దీన్ని కుంభమేళాగా పిలుస్తారని హిందూధర్మ శాస్త్రాలు పేర్కొంటున్నాయి.
వేదకాలం నుంచి కుంభమేళాను నిర్వహిస్తున్నట్టు పురాణాలు చెపుతున్నాయి. పురాణాల్లో గమనిస్తే భాగవతంలోని క్షీర సాగర మథనంలో కుంభమేళాకు సంబంధించిన ప్రస్తావన వస్తుంది. క్షీర సాగర మథనంలో ఉద్భవించిన అమృతానికై దేవతలు, రాక్షసుల మధ్య దేవ - దానవ సంగ్రామం జరిగింది. ఆ సమయంలో మహావిష్ణువు ఈ అమృతాన్ని తీసుకొని వెళుతూ అలహాబాద్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్‌లలో కొన్ని అమృతపు చుక్కలు జారి విడిచినట్టు పురాణాలు చెపుతున్నాయి. అందుకే ఈ నాలుగు ప్రదేశాలలో ఒక చోట ప్రతి మూడేళ్లకు ఒకసారి కుంభమేళా వేడుకలను నిర్వహిస్తుంటారు. అంటే ప్రతి పన్నెండేళ్లకు ఒక సారి ఒక పట్టణంలో కుంభమేళా వేడుకలు నిర్వహిస్తారు. ఆరేళ్లకు ఒకసారి జరిగే దాన్ని అర్థ కుంభమేళా అని.. 12 యేళ్లకు ఒకసారి జరిగే వేడుకలను పూర్ణ కుంభ మేళా అని, 144 ఏళ్లకు ఒకసారి జరిగే వేడుకలను మహా కుంభ మేళా అని పిలుస్తారు.
సూర్యుడు, బృహస్పతి గతుల స్థానాల ఆధారంగా ఈ వేడుకను నిర్వహిస్తుంటారు. సూర్యుడు, బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్‌లోని త్రయంబకేశ్వర్‌లోనూ, సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్‌లోనూ, బృహస్పతి వృషభ రాశిలోనూ ఇంకా సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు అలహాబాద్ ప్రయాగలోనూ, బృహస్పతి, సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలోనూ కుంభమేళా నిర్వహిస్తారు. చివరగా 2010 జనవరి - మార్చిలో హరిద్వార్‌లో పూర్ణకుంభమేళాను నిర్వహించారు.
ఎక్కడైతే ఈ మేళా నిర్వహిస్తారో అక్కడ నదీ జలాలతో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తుంటారు. వేల పంఖ్యలో సాధువులు, సన్యాసులు హాజరు కావడం ఈ మేళా ప్రత్యేకత. పురాతన సాంప్రదాయాలను ప్రతిబింభించేలా ఈ సాధువులు వొళ్లంతా విబూది రాసుకొని ఉంటారు. నాగ సన్యాసులనే సాధువులు దిగంబరులై కుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణ. ఇప్పటివరకూ అత్యధికంగా నాసిక్ కుంభమేళాలో 7.5కోట్ల మంది పాల్గొన్నారు. ఈ దఫా ఈ సంఖ్య పది కోట్లకు పైగానే ఉంటుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ కుంభమేళాలో కొన్ని రోజులను అత్యంత పవిత్రమెనవిగా భావిస్తారు. వీటిలో ఈ యేడాది 2025 జనవరి 14వ తేదీన వచ్చిన మకర సంక్రాంతి, 27వ తేదీన వచ్చే పౌర్ణమి, ఫిబ్రవరి 6న వచ్చే ఏకాదశి రోజు, 10న వచ్చే అమవాస్య, 15న కనిపించే వసంత పంచమి, 17న రథ సప్తమి రోజు, 18న భీష్మాష్టమి, 25వ తేదీ మాఘ పౌర్ణమి రోజుల్లో ఎక్కువ మంది భక్తులు పవిత్ర పుణ్యస్నానాలు ఆచరిస్తుంటారు.
కుంభమేళాలో నాగసాధువులు |
కుంభమేళ
ఈ నాలుగు చోట్లే ప్రయాగ (ప్రయాగరాజ్), హరిద్వార్ (ఉత్తరప్రదేశ్), నాసిక్ (మహారాష్ట్ర), ఉజ్జయిని(మధ్యప్రదేశ్). అందుకే ఈ నాలుగుచోట్ల కుంభమేళాలు జరుగుతాయి.ప్రతీ 3 ఏళ్ల కొకసారి కుంభమేళ జరుగుతుంది. అంటే ఒక్కోచోట ప్రతి 12 ఏళ్ళకొకసారి కుంభమేళ జరుగుతుంది.
చరిత్ర, విశిష్టత
కుంభం అనగ కుండ అంటే కలశం అని అర్థం. ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభం అనేది ఒక రాశి. మేళ అంటే కలయిక లేదా జాతర అని అర్థం. కుంభరాశిలో నిర్వహించే ఉత్సవం కావడంతో దీనిని కుంభమేళ గా పిలుస్తారని హిందూధర్మ శాస్త్రాలు తెలుపుతున్నాయి. ఎందుకంటే తానో బహిర్గతంగా జీవం వున్నవాడుగా. ఇప్పుడు మనం కుంభమేళా గురించి తెలుసుకుని,ఆనందించి జీవిత విధివిధానంలో మన పాత్రేమిటో తెలుసుకుందాం.
కుంభమేళాలో నాగసాధువులు |
మహాక్రతువు
దేశం నలుమూలలనుంచే కాక,ప్రపంచం అంతట్నుంచీ తండోపతండాలుగా భక్తులు వచ్చి పుణ్యస్నానాలాచరించే మహాక్రతువు కుంభమేళా. త్రివేణీ సంగమ క్షేత్రంలో జరిగే మహాక్రతువు కుంభమేళా.
ప్రయాగ
ప్రాణికోటి మనుగడకు నీరే ఆధారం. హిందూ సంస్కృతిలో నదులన్నిటినీ దేవతలుగా భావిస్తారు. మన దేశంలో వున్న 7 ముఖ్యమైన తీర్ధ క్షేత్రాలలో ఒకటి ప్రయాగ.
త్రివేణీ సంగమం
ప్రయాగ అంటే ప్రకృష్టమైన యాగం చేసే స్థలం అని అర్ధం.గంగ,యమునా,సరస్వతి నదులు ఈ క్షేత్రంలోనే సంగమించటం వల్ల దీనికి త్రివేణీ సంగమం అని పేరు వచ్చింది.
పుణ్య స్నానాలు
దేశం నలుమూలల నుంచే గాక ప్రపంచం అంతటినుంచీ తండోపతండాలుగా వచ్చి భక్తులు వచ్చి పుణ్య స్నానాలు ఆచరించే మహాక్రతువు కుంభమేళా.
గంగానదీ
కనుక దీన్నిబట్టి నదినీటినీ,అందులోను గంగా నదినే మనం ప్రథమంగా స్మరిస్తాం. సమస్త దేవతలూ నివశించే స్థలం జలం. మన శరీరంలో నీటి శాతమే ఎక్కువ. పావనత్వం,కోమలత్వం,శీతలత్వం గంగానదీ నీటి యొక్క ప్రత్యేకత.
సరస్వతీ నది
విష్ణువు పాదాల నుంచి నేరుగా భూమి పైకొచ్చిందని దీనిలో స్నానం ఆచరిస్తే హిందువుల యొక్క పవిత్రమైన భావన. ప్రయాగలో గంగా యమునా నదులు ప్రవహిస్తూవుంటాయి. అంతర్వాహినిగా సరస్వతీ నది కూడా ప్రవహిస్తూవుంది
త్రివేణీ సంగమ తీరం
అందుకే ఈ తీరాన్ని త్రివేణీ సంగమ తీరంగా పిలుస్తూంటాం.పర్వదినాలలో ఈ నదిలో స్నానమాచరిస్తే పాపాలకు విముక్తి లభిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం.అంతేకాకుండా కుంభమేళాలో పుణ్యస్నానం చేస్తే మోక్షం లభిస్తుందని పునర్జన్మ వుండదని భక్తులు విశ్వశిస్తారు.
అమృతం
అయితే ఈ కుంభమేళా ప్రాశస్త్యం గురించి తెలుసుకుందాం. కుంభమేళా కు హిందూ పురాణాలలో ప్రత్యేక కధనం వుంది. అసురులచేతుల్లో సర్వం కోల్పోయిన ఇంద్రుడు తిరిగి పూర్వ వైభవం కోసం విష్ణువునాశ్రయిస్తాడు. అమృతం కోసం సాగర మధనం చేయాలని దానితో తిరుగుండదని విష్ణువు సలహా ఇస్తాడు
అమృత కలశం
దేవదానవులు సముద్రమథనం చేస్తుండగా అమృత కలశం ఒకటి బయటికొస్తుంది. అమృతం కోసం దేవదానవులు 12 రోజులు,12 రాత్రులు అంటే మనుష్యుల ప్రకారం 12సంవత్సరాలు.ఘోరయుద్దం చేశారు.
విష్ణువు
దీనిని రాక్షసులు గనక తాగితే అజేయులౌతారని భావించిన రాక్షసులు మహా విష్ణువును ప్రార్థించగా స్వామి మోహినీ అవతారం ఎత్తుతారు.విష్ణువు చేతిలోని కలశం నుండి నాలుగు అమృతపు చుక్కలు అలహాబాద్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ లలోని పుణ్యనదులలో పడ్డాయని భాగవతం, విష్ణు పురాణం, మహాభారతం, రామాయణం తదితరాల పురాణాల కధనం
సాగరమథనం
మరో కధ కూడా వుంది. సాగారమథనంలో ఉద్భవించిన అమృతకలశాన్ని మోహినీ అవతారంలో విష్ణువు తన వాహనమైన గరుడునికిచ్చి బద్రపరచమంటాడు.గరుడుడు తన కలశాన్ని తీస్కువెళ్తుండగా 4 చోట్ల ఈ చుక్కలు పడతాయట.