Suhas swears on Bhagavad Gita in US Congress |
అమెరికాలోని ఈస్ట్ కోస్ట్ ప్రాంతం నుంచి కాంగ్రెస్ చట్టసభకు ఎన్నికైన తొలి ఇండో అమెరికన్ సభ్యుడు సుహాస్ సుబ్రహ్మణ్యం హిందువుల పవిత్ర గ్రంథమైన భగవద్గీతపై ప్రమాణం చేసి తన బాధ్యతలను స్వీకరించారు.
సుబ్రహ్మణ్యం మాతృమూర్తి ఈ దృశ్యాన్ని వీక్షించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు మాజీ పాలసీ సలహాదారు అయిన సుబ్ర హ్మణ్యం 2019లో వర్జీనియా జనరల్ అసెంబ్లీకి ఎన్నిక య్యారు. అమెరికా ప్రతినిధుల సభ సభ్యుడిగా ప్రమాణం చేసిన మరో ఇండో అమెరికన్ రాజా కృష్ణమూర్తి భగవద్గీత నుంచి ఓ భాగాన్ని చదివి వినిపించారు. 2013 జనవరిలో అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికైన తులసీ గబ్బార్డ్ భగవద్గీతపై ప్రమాణం చేసిన తొలి హిందూ అమెరికన్గా నిలిచారు.