కిరాత వారాహి మంత్రం అతి శక్తివంతమైన మంత్రం.
ఎలాంటి ప్రయోగలుని అయిన తిప్పికొట్టగలిగే శత్రువుల ని సంహరించే , షట్చక్రాలని జాగృతం చేయడానికి అతిశక్తివంతమైన అతి అరుదు అయిన మంత్రం.
గురుముఖత గా తీసుకున్న మంత్రాలు ఇంకా ఎక్కువ ఫలితాలు ఇస్తాయి శీఘ్రముగా గా ఫలితాలు ఇస్తాయి, గురువు లేని కుదరని పక్షం లో మేరు తంత్రాన్ని అనుసరించి ఇలా చేయవచ్చు
చాలా శక్తి వంతమైన ఈ మూలమంత్రం ఆ తల్లినే గురువుగా భావించండి మంత్రం పేపర్ లో రాసి శివలింగం దగ్గర ఉంచి శివుడు ఉపదేశం ఇచ్చినట్టు భావించి మంత్రం జపం చేయండి రోజూ 108 సార్లు కుదిరితే 1008 సార్లు రోజూ చేయండి, 41 రోజులు చేయండి
వారాహి మంత్ర రహస్యం
“ఓం” అనేదిశక్తి అయితే, భువనేశ్వరీబిజమైన “ హ్రీం” అనేది శక్తిని పదార్ధంగా మార్చి పదార్థమై కూర్చొనే మరొక శక్తి లేదా అదే శక్తి. మూలాధార చక్రమందు కుండలిని వుంటుంది. దానినే 'వారాహి అంటారు. వారము అంటే చుట్ట. అహి అంటే కుండలిని లేక పాము. చుట్టలు చుట్టుకున్న పామువలే మూడున్నర చుట్టలు చుట్టుకున్న కాంతి మన మూలాధారంలో కుండలినియై అంతరిక్షము నుండి బ్రహ్మరంధ్రానికి, బ్రహ్మరంధ్రము నుండి సహస్రారానికి, అక్కడ నుండి ఉన్మని, అక్కడి నుండి ఆజ్ఞ, అంబిక, విశుద్ధం, అనాహతం, మణిపూరం చివరకు స్వాధిష్ఠానం ద్వారా మూలాధారంలోకి వచ్చి అక్కడ కూర్చొని మనను బతికిస్తున్నది. కుండలినిని జాగృతం చేయటానికి, మనలొ శక్తిని పెంచటానికి, తక్కువైతే భర్తీ చేసుకోవటానికి ఈ వారాహ మంత్రము పనికివస్తుంది.