Moral story |
కృతజ్ఞత
అడవిలో కట్టెలు కొట్టుకునేందుకు రామయ్య వెళ్ళాడు. అక్కడికి సమీపములో వేటగాడు వలపన్ని బియ్యం నూకలు వెదజల్లి వుంచాడు. వాటికి ఆశపడి జంటపావురాళ్ళు వలలో చిక్కుకుని ప్రాణభీతితో ఉన్నాయి. వాటిని వల తప్పించి పైకి ఎగురవేశాడు రామయ్య.
కొంతకాలము గడిచింది. రామయ్య అడవికి వెళ్ళి వస్తూనే వున్నాడు. ఒక రోజు దారి తప్పి అడవిలో బాగా పైకి వెళ్ళిపోయాడు. దారి తెలియక అవస్థపడుతున్నాడు. చీకటి పడింది. క్రూరమృగములు తనని ఏం చేస్తాయోనని భయపడుతూ అక్కడికి సమీపంలో గల సత్రం వద్దకు చేరుకున్నాడు. ఇంతలో వర్షం ప్రారంభమయింది. ఏమిటో ఈ పాడు వర్షము, ఇంటికెలా వెళ్ళాలో తెలియటంలేదు. అని భాధపడుతున్నాడు.
ఆ సమీపములో గల పావురముల జంట రామయ్యని గుర్తించాయి. దారితప్పిన అతన్ని గమ్యస్థానము చేర్చే ఉద్దేశ్యముతో తలగుడ్డ తన్నుకుని వెళ్ళాయి. రామయ్య తల గుడ్డకు వంగి పైకి చూసి ఆ పావురముల వెంట బయలుదేరి గమ్యస్థానము చేరుకున్నాడు. ఎంత చిన్న జీవులైన తనని గమ్యస్థానము చేర్చినందుకు భగవన్నామస్మరణ చేస్తూ ఇల్లు చేరాడు. ఆ పావురముల జంట కృతజ్ఞతకు మురిసిపోయాడు. తర్వాత వాటిని తన వద్దనే వుంచుకుని పెంచుకోసాగాడు.