పురాతన శాస్త్రాలు జ్ఞానానికి మూలాధారమని సంస్కృత వర్సిటీ వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తి తెలిపారు.తిరుపతిలోని సంస్కృత వర్సిటీలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి శాస్త్రీయ వక్తృత్వ పోటీలలో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఆయన ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు. వీసీ మాట్లాడుతూ అధ్యాపకుల నైపుణ్యాన్ని వినియోగించుకుని చక్కగా విద్యను అభ్యసించాలని సూచించారు. జ్ఞాన సముపార్జనతో విజయం దాసోహమవుతుందని తెలిపారు.
పోటీలలో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థులు మార్చిలో ఢిల్లీ కేంద్రీయ సంస్కృత వర్సిటీ వారు హరిద్వార్‌లో నిర్వహించే అఖిల భారత శాసీ్త్రయ వక్తృత్వ పోటీల్లో పాల్గొననున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో కాంచీపురం చంద్రశేఖరేంద్ర సరస్వతి వర్సిటీ వీసీ ప్రొఫెసర్ వసంత కుమార్ మెహతా, డీన్ ప్రొఫెసర్ రజినీకాంత్ శుక్లా, కో–ర్డినేటర్ డాక్టర్ సీహెచ్ నాగరాజు పాల్గొన్నారు.