కుంభమేళాపై తప్పుడు వ్యాఖ్యలు చేసిన ఆలిండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షాహబుద్దీన్ రజ్వీ బరేల్వీ పై సాధు సంతులు సీరియస్ అయ్యారు. రజ్వీ బరేల్వీ మానసిక స్థితి ఏమాత్రం బాగోలేదని రవీంద్ర పూరీ మహారాజ్ అన్నారు. కుంభమేళా జరుగుతున్న ప్రాంతం గంగామాతది అని అన్నారు. ‘‘రజ్వీ బరేల్వీ మానసిక స్థితి ఏమాత్రం బాగోలేదు. మంచి సదుపాయాలున్న దగ్గర ఆయన చికిత్స పొందాలి. చికిత్స మేము కూడా అందిస్తాం. ఈ కుంభమేళా ప్రాంతం మొత్తం గంగా మాతకే చెందుతుంది. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆయన మానుకోవాలి. వారి పరిమితుల్లో వారు వుండాలి. రాజకీయాలు చేయడం మానుకోవాలి. ’’ అంటూ రవీంద్ర పూరీ మహారాజ్ అన్నారు.
దీపాంకర్ స్వామీజీ కూడా షాహబుద్దీన్ రజ్వీ బరేల్వీపై సీరియస్ అయ్యారు. అలాంటి తప్పుడు ప్రకటనలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. ఆ వ్యాఖ్యలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ప్రతిదీ తమ స్థలమేనంటూ చెబుతుంటారని, ఒక్క నోటీసు కూడా ఎందుకు పంపలేదు. పంపరు కూడా. ఈ ప్రాంతమంతా గంగామాతకు సంబంధించింది. ఇంకా ఎంత విధ్వంసం చేస్తారు? ప్రపంచంలోనే అతి పవిత్రమైంది మహాకుంభ మేళా. అతి కొద్ది రోజుల్లోనే ఇది జరగబోతోంది. ఇలాంటి సమయంలో ఇలాంటి ప్రకటనలు సరికావు’’ అని దీపాంకర్ స్వామీజీ అన్నారు.
మహా కుంభమేళా జరిగే ప్రాంతం వక్ఫ్ ప్రాంతమంటూ రజ్వీ బరేల్వీ పేర్కొన్నారు. అంతేకాకుండా
పుష్కరానికి ఓసారి జరిగే అత్యంత పవిత్రమైన మహా కుంభమేళా విషయంపై ఆలిండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షాహబుద్దీన్ రజ్వీ బరేల్వీ శుద్ధ తప్పుడు వ్యాఖ్యలు చేశాడు. కుంభమేళా మాధ్యమంగా ముస్లింల మత మార్పిడికి ప్రయత్నాలు జరుగుతున్నాయని రెచ్చగొడుతున్నారు. మహాకుంభమేళా వైపు ముస్లింలు అస్సలు తొంగిచూడొద్దని కూడా ఈయనే హుకూం జారీ చేశారు. కుంభమేళాలో ముస్లింల మత మార్పిడి తంతు జరుగబోతున్నట్లు తమకు సమాచారం అందిందని పేర్కొన్నాడు. అయితే.. ఆ సమాచారం ఎవరు అందించారన్నది మాత్రం చెప్పనేలేదు. ఈ విషయంలో తాము సీఎం యోగికి లేఖ రాశామని, చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అంటూ చేతులు దులిపేసుకున్నాడు.