శ్రీ శ్యామల దేవి |
నవరాత్రులు వివరములు :
నవరాత్రిని సంవత్సరంలో నాలుగు సార్లు జరుపుకుంటారు. వాటిని వసంత నవరాత్రి, ఆషాఢ నవరాత్రి, శారదా నవరాత్రి మరియు పౌష్య/మాఘ నవరాత్రి అంటారు. వీటిలో, పురతషి మాసంలో వచ్చే శారదా నవరాత్రి మరియు వసంత కాలంలో వచ్చే వసంత నవరాత్రి చాలా ముఖ్యమైనవి.
1. వసంత నవరాత్రి :
వసంత నవరాత్రులు అని కూడా గుర్తించబడే బసంత నవరాత్రి, వసంత ఋతువులో (మార్చ్-ఏప్రిల్) తొమ్మిది రూపాల శక్తి మాతని (దేవీ మాత) ఆరాధించడానికి అంకితం చేసిన తొమ్మిది రోజుల పండుగ. దానిని చైత్ర నవరాత్రులని కూడా గుర్తిస్తారు. ఈ తొమ్మిది రోజుల పండుగను రామ నవరాత్రులని కూడా అంటారు.
2. గుప్త నవరాత్రి :
ఆషాఢ లేదా గాయత్రి లేదా శాకంబరి నవరాత్రులుగా గుర్తించే గుప్త నవరాత్రులను ఆషాఢ మాసంలో (జూన్-జులై), తొమ్మిది రూపాల శక్తి మాతను (దేవిమాత) పూజించడానికి అంకితం చేసిన తొమ్మిది రోజుల పండుగగా గుర్తిస్తారు. ఆషాఢ శుక్లపక్షాన (చంద్రుడు పూర్ణబింబాన్ని సంతరించుకునే కాలం) గుప్త నవరాత్రులను జరుపుకుంటారు.
3. శరన్నవరాత్రులు :
అన్ని నవరాత్రులలో ఇది అతి ముఖ్యమైనది. దీనిని టూకీగా, మహా నవరాత్రి (గొప్ప నవరాత్రి) అని అంటారు, ఈ ఉత్సవాన్ని అశ్విన మాసంలో జరుపుకుంటారు. శరద్ నవరాత్రులుగా కూడా గుర్తించబడిన ఈ నవరాత్రులను, శరద్ ఋతువులో (శీతాకాలం మొదట్లో అంటే, సెప్టెంబర్-అక్టోబర్) జరుపుకుంటారు.
4. పౌష్య నవరాత్రి :
పౌష్య నవరాత్రి అనేది తొమ్మిది రూపాల శక్తి మాతను (దేవీ మాత) పూజించడానికి అంకితం చేసిన తొమ్మిది రోజులు, దీనిని పుష్య మాసంలో (డిసెంబర్-జనవరి) వచ్చే పౌష్య నవరాత్రి అంటారు. పౌష్య శుక్ల పక్షంలో (చంద్రుడు పూర్ణ బింబాన్ని సంతరించుకునే కాలంలో), పౌష్య నవరాత్రులు జరుపుకుంటారు.
5. మాఘ నవరాత్రి :
గుప్త నవరాత్రిగా కూడా గుర్తించబడే మాఘ నవరాత్రిని, మాఘమాసంలో (జనవరి-ఫిబ్రవరి) తొమ్మిది రూపాలలో శక్తిని మాతను (దేవీ మాత) తొమ్మిది రాత్రులు ఆరాధించే పండుగగా గుర్తిస్తారు. మాఘ నవరాత్రిని మాఘ శుక్ల పక్షాన (చంద్రుడు పూర్ణబింబాన్ని సంతరించుకునే సమయంలో) జరుపుకుంటారు.
శ్రీ రాజ శ్యామల అమ్మవారి గుప్త నవరాత్రి దీక్ష విధానం
నేడు జనవరి 30 గురువారం నుండి శ్యామల నవరాత్రి ప్రారంభం:
ముందుగా మీ యొక్క గృహాలను శుభ్రం చేసుకోండి ఇంట్లో అంటూ ముట్టు లేకుండా చూసుకొని ఇంట్లో గంగాజలం చల్లండి,, ఇది పూజకు ముందు రోజు చేసుకోవాలి.
తొమ్మిది రోజులు దీక్ష వస్త్రాలు ధరించి పూజ నిర్వహించుకోవాలనుకుంటే ముందుగా ఎరుపు రంగు లేదా ఆకుపచ్చ రంగు దీక్ష వస్త్రాలను సిద్ధం చేసుకుని ఉంచండి, దీక్ష వస్త్రాలు కాకుండా సాధారణంగా మీ పనులు మీరు చేసుకుంటూ కూడా దీక్షలో ఉండవచ్చు
- ఈ రోజు నవరాత్రి ప్రారంభం కాబోతుంది కాబట్టి ఉదయాన్నే లేచి తల స్నానం చేసి దీక్షా వస్త్రాలు వేసుకోవాలనుకునే వ్యక్తులు దీక్ష వస్త్రాలు వేసుకోవాలి సాధారణంగా చేసుకోవాలనుకునే వ్యక్తులు పూజ సమయంలో మాత్రం మడి బట్టలు వేసుకోవాలి.
- అమ్మవారిని ఒక పీఠం పైన పెట్టి పూజ చేసుకోవాలనుకునే వ్యక్తులు ఒక పీట పెట్టి దానిపైన ఎరుపు లేదా ఆకుపచ్చ వస్త్రం వేసి అమ్మవారి ఫోటో ఒకటి పెట్టండి మీ దగ్గర శ్యామల అమ్మవారి చిత్రపటం ఉంటే అమ్మవారిచిత్రపటం లేకపోతే ఏదైనా అమ్మవారి స్వరూపాన్ని అక్కడ పెట్టండి లేదా పీఠం పెట్టడం సాధ్యం కాకపోతే అమ్మవారి ఫోటో ఎక్కడ ఉంటుందో అక్కడే పూజా కార్యక్రమాలు చేసుకోండి ఇబ్బంది లేదు, కలశ స్థాపన చేయాలనుకునే వ్యక్తులు తొమ్మిది రోజులు కలశాన్ని ఉంచండి తొమ్మిది రోజులు పూర్తయిన తర్వాత ఆ టెంకాయను ప్రసాదంగా స్వీకరించండి.
- పీఠం కలశం పెట్టాలనుకునే వ్యక్తులు పీఠం పెట్టి దాని ప్రక్కన కలశాన్ని కూడా పెట్టండి.
- అఖండ జ్యోతి 9 రోజులు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు అఖండ జ్యోతి కి ఆవు నెయ్యి కానీ లేదా సాధారణ నువ్వుల నూనె కానీ ఉపయోగించుకోవచ్చు మీ స్తోమత బట్టి ముందుగా దీపారాధన గణపతి పూజ కలశ స్థాపన చేసి పూజ ప్రారంభించండి.
- ఆచమనం చేయడం వచ్చేవారు ఆచమనం చేయండి రాని వాళ్ళు వదిలేయండి.
- దీపారాధన ఆచమనం గురు ప్రార్ధన గణపతి పూజ సంకల్పం చెప్పడం వస్తే చెప్పుకోండి లేదు అనుకుంటే మీకున్నటువంటి సమస్యలను ఇబ్బందులను అమ్మవారికి చెప్పి పూజను ప్రారంభించండి.
గణపతి పూజ తర్వాత అమ్మవారి పూజ చేయాలి
ఏదైనా అమ్మవారి విగ్రహం ఉంటే ప్రతిరోజు ఆ విగ్రహానికి మీ శక్తి కొద్ది అభిషేకం చేయండి శక్తి లేనివారు నీటితో అభిషేకం చేస్తే సరిపోతుంది శక్తి ఉన్నవారు ఆవు పాలు పంచామృతాలతో అలాగే పండ్ల రసాలతో అభిషేకం నిర్వహించండి.
- అభిషేకం తర్వాత వస్త్ర సమర్పణ చేయండి ఫోటో పెట్టుకుని పూజ చేసే వారికి అభిషేకం చేసే సౌలభ్యం ఉండదు, శ్యామల అష్టోత్తర నామాలు శ్యామల దండకం చదవడం వస్తే చదవండి అలాగే శ్యామల సహస్రనామాలు అవకాశం ఉన్న పారాయణం చేయండి.
- ఇవి ఏవి రాకపోతే కనీసం దుర్గా సప్తశ్లోకి పారాయణం చేయండి.
- కుంకుమార్చన చేయాలనుకునే వ్యక్తులు అష్టోత్తర నామాలు చదువుతూ కుంకుమార్చన చేయండి.
- అమ్మవారికి గాజుల సమర్పణ చేయాలనుకుంటే ఎరుపు లేదా ఆకుపచ్చ గాజులు సమర్పణ చేయండి.
- మీ శక్తి కొద్ది మీకు ఇష్టమైనటువంటి పండ్లను ప్రసాదంగా పెట్టండి.
- మీ ఇంట్లో కాని వ్యాపార స్థలంలో కానీ కట్టుకోవడానికి తొమ్మిది రోజులు పూజలు లేదా పీఠం దగ్గర ఒక పీచు తీయని కొబ్బరికాయ ఉంచుకోండి.
- అలాగే చేతికి కట్టుకోవడానికి వీలుగా తొమ్మిది రోజులు రక్ష కంకణాలను తెచ్చుకొని పూజలో ఉంచుకోండి.
తొమ్మిది రోజులు దీక్ష చేసే వ్యక్తులు ఆచరించవలసిన నియమాలు
- దీక్షా వస్త్రాలు ధరించాలనుకుంటే దీక్ష వస్త్రాలు ధరించండి ధరించుకున్న ఇబ్బంది లేదు
- తొమ్మిది రోజులు ఉదయం సాయంత్రం స్నానం చేయాలి.
- ఉదయం సాయంత్రం దీపారాధన చేయాలి.
- అలాగే పూజ ప్రారంభంలో గురు ప్రార్ధన గణపతి ప్రార్ధన తప్పకుండా చేయాలి.
- తర్వాత అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణం చేయాలి.
- వీలున్నవాళ్లు శ్యామల అష్టోత్తర నామాలు చదవచ్చు.
- అది కూడా సాధ్యం కాకపోతే ద్వాదశ నామాలైన చదువుకోవచ్చు .
- అమ్మవారికి వస్త్రాలు గాజులు, పసుపు, కుంకుమ ఇలా సుగంధ ద్రవ్యాలు సమర్పణ చేసుకోవచ్చు
- జామకాయలు లేదా ఆకుపచ్చ పుష్పాలు ఏవైనా మీకు ఆకుపచ్చని రంగులో ఉండే వస్తువులను అమ్మవారి ప్రీతిగా పెట్టవచ్చు .
- పాయసన్నం ఆవుపాలు నైవేద్యంగా పెట్టవచ్చు.
- అఖండ దీపం పెట్టాలనుకుంటే తొమ్మిది రోజులు అఖండ దీపం పెట్టండి ..
- అమ్మవారి విగ్రహం ఉంటే ప్రతిరోజు ఉదయం అమ్మవారికి అభిషేకం నిర్వహించండి .
- ఏవి లేకపోతే ఏదైనా అమ్మవారి చిత్రపటం ఉంటే ఆ చిత్రపటానికి ప్రతిరోజు పూజా కార్యక్రమాలు నిర్వహించండి.
- పూజలు ఎంత ఆడంబరంతో నిర్వహిస్తే అంత మంచిది కాదు భక్తితో శ్రద్ధతో నిర్వహించాలి. ఆడంబరాలకు పోకూడదు శ్రద్ధ లేని పూజ దీనికి పనికిరాదు.
- తొమ్మిది రోజులు కూడా సాత్విక ఆహారం స్వీకరించాలి.
- అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ తినే ఆహార పదార్థాలలో ఉపయోగించకూడదు.
తొమ్మిది రోజులు సాత్వికంగా ఉండి సాత్వికాహారం స్వీకరించాలి
- ఆరోగ్యం సహకరిస్తే ఒక పూట భోజనం మరొకపూట ఫలాలు లేదా అల్పాహారం తీసుకోవచ్చు.
- ఆరోగ్యం సహకరించకపోతే ఎటువంటి ఆహార నియమాలు లేవు కాబట్టి ఆరోగ్యం ముఖ్యం.
- పూజ ప్రారంభించే ముందు మీకున్నటువంటి సమస్యలను ఇబ్బందులను అమ్మవారికి నివేదించండి అమ్మవారి చరణాలను ప్రార్థించండి తప్పకుండా ఆ సమస్యలు పరిష్కారం అవుతాయి.
- దీక్ష సమయంలో నిరంతరం అమ్మవారి నామస్మరణ చేయండి అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదవండి .
- మెడలో తొమ్మిది రోజులు కండువ వేసుకోవాలనుకుంటే వేసుకోండి.
- చెప్పులు ధరించకూడదు.
- ప్రతిరోజు శుభ్రమైనటువంటి దుస్తులు మాత్రమే ధరించాలి.
- ఇలా మీ వీలున్ని బట్టి నవరాత్రిని సులభంగా చేసుకోవచ్చు.
మన ఎల్లారెడ్డి పట్టణంలోని బగలాముఖి పీఠంలో అనేక సంవత్సరాలుగా ఈ గుప్త నవరాత్రులు చాలా విశేషంగా జరుగుతాయి ఈ పీఠంలో శ్యామల అమ్మవారి ప్రసన్నం జరిగింది ఇక్కడ అనేకమందికి శుభ ఫలితాలు కలుగుతున్నాయి.
శ్రీ భగలాముఖి పీఠం సిద్దపీఠంగా తెలుగు రాష్ట్రాలలో పేరు పొంది ఉంది, ఇక్కడ చేసే ప్రతి పూజ విశేషమైనటువంటి శుభ ఫలితాలను కలిగిస్తుందని భక్తుల విశ్వాసం. రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం వలన మంచి విద్య జ్ఞానము బుద్ధి ఆకర్షణ వ్యాపార అభివృద్ధి ధనాకర్షణ ఆర్థికంగా మంచి స్థితిగతులు అలాగే వివాహం కాని వ్యక్తులకు వివాహం సంతానం కాని వ్యక్తులకు సంతానం ప్రభుత్వ ఉద్యోగం లేదా ఉద్యోగం కోరుకునే వ్యక్తులకు మంచి ఉద్యోగం అలాగే పదోన్నతి అలాగే రాజకీయ నాయకులకు రాజయోగం అలాగే పదవియోగం వచ్చే అవకాశాలు ఉంటాయి శ్రీదేవి ఆరాధన చేసే గృహాలలో ముఖ్యము లక్ష్మి తాండవిస్తుంది వాళ్లకు ఉన్నటువంటి సమస్తమైనటువంటి కోరికలు నెరవేరుతాయి.
కాబట్టి సిద్ధపీఠం అయినటువంటి బగలాముఖి *పీఠంలో మీ పేరిట గోత్రనామాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలనుకుంటే చెల్లించవలసినటువంటి రుసుము 501.రు రుసుము పంపవలసిన నంబర్ 9704829625, పంపిన రుసుము అలాగే మీ యొక్క గోత్రనామాలు దానికి సంబంధించిన వివరాలు పంపవలసిన వాట్స్అప్ నంబర్ 9704829625.
దేవి ఆశీస్సులతో - మీ దుర్గి శ్రీకాంత్ శర్మ