తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటిచెప్పాలనే సంకల్పంతో గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయం (జీజీయూ)ప్రాంగణంలో రెండు రోజులపాటు నిర్వహిస్తున్న 2వ ప్రపంచ తెలుగు మహాసభలు ముగిశాయి. జీజీయూ ప్రాంగణంలో ఆదికవి నన్నయ భట్టారక, రాజరాజ నరేంద్ర, సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు పేరిట మూడు ప్రధాన వేదికలను ముస్తాబుచేసి తెలుగు భాషా సాహితీ ప్రక్రియలను నిర్వహించారు.
ప్రధాన వేదిక చెంతనే ఆధు నిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటుచేసిన అయోధ్య బాలరాముడి ఆలయ నమూనా అందరినీ అబ్బురపరుస్తోంది. ఉదయం గణపతి ఆరాధన అనంతరం జీజీయూ కులపతి కలిదిండి సత్యనారాయణరాజు(చైతన్యరాజు) అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలను మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలనచేసి ప్రారంభించారు. పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీప్ర సాద్ సభను ప్రారంభించారు. ఈ సందర్భం గా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ రాష్ట్రం లో పాలన అంతా తెలుగులోనే సాగాలి. ఇక తెలుగు మాట్లాడేవాడికే ఓటేయాలి. తెలుగు భాష రానివాళ్లను ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు. బ్రిటిష్వాళ్లు రాజమహేంద్ర వరం వంటి పేర్లు పలకలేక రాజమండ్రిగా మార్చారు. ఇక రాజమహేంద్రవరం అనే పిల వాలి. ఇలా చాలాపేర్లు, పదాలు మార్చేసి, మనభాషను, సంస్కృతిని చెడగొట్టారు. వాటిని మనం సరిదిద్దుకోవాలన్నారు. ఆదికవి నన్నయ్య, ఆధునిక వైతాళికుడు, సంఘ సం స్కర్త కందుకూరి వీరేశలింగం వంటి వారెం దరో తెలుగుభాషను సుసంపన్నం చేశారని గుర్తుచేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో మహాసహస్రావధాని పద్మశ్రీ గరికపాటి నరసింహారావు, బృహత్ ద్విసహస్రావధాని డాక్టర్ మాడుగుల నాగఫణిశర్మ, ఆధ్యాత్మికవేత్త, శ్రీభారతీ తీర్ధ పురస్కార గ్రహీత పి.బంగారయ్యశర్మ, సినీ గేయరచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, ప్రొఫెసర్ చామర్తి రాజు, కేటీ రామరాజు, యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా సోలోమన్ డార్విన్, మాజీ ఎమ్మెల్సీ గోనె ప్రకాశరావు, శతావధాని కడిమెళ్ల వరప్రసాద్, ధూళిపాళ మహాదేవమణి, ప్రముఖ హాస్యనటుడు భద్రం, స్టార్టప్ కంపెనీ స్థాపిం చి వేలాదిమందికి ఉపాధి కల్పిస్తున్న మృ త్యుంజయేశ్వర్, గోమూత్రంతో కేన్సర్, డయాబెటీస్ వంటి వాటికి మందులు తయారు చేస్తున్న మహారాష్ట్రకు చెందిన కన్నయ్య కదం జి, న్యూక్లియర్ శాస్త్రవేత్త ఆర్.శ్యామసుందర్, సాహితీవేత్త ఎర్రాప్రగడ రామకృష్ణ, వేదుల శిరీష, మధుఫ్రోమ్రా, జీజీయూ ఉపకులపతి ఉదయగిరి చంద్రశేఖర్, జీజీయూ ప్రోఛాన్సలర్ కె.శశికిరణ్వర్మ, మాజీ ఎమ్మెల్సీ రవివర్మ తదితరులు విచ్చేశారు. ప్రముఖులు పీవీబీ సంజీవరాజు, సత్యనారాయణరాజు, కృష్ణంరాజు, సుబ్బరాజు, వీఎస్ఆర్ సోమయాజులు, పలువురు సాహితీవేత్తలు పాల్గొన్నారు.
తెలుగుభాష కోసం ఉద్యమించాలి : గరికిపాటి
ఒకటవ తరగతి నుంచి 5వ తరగతి వరకు విధిగా తెలుగు మాధ్యమమే ఉండాలి. డిగ్రీ వరకు తెలుగు పాఠ్యాంశం ఉండాలి. ఇందుకోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఉద్యమించాల్సిన ఆవశ్యకత ఉందని మహాసహస్రావధాని, పద్మశ్రీ గరికిపాటి నరసింహరావు అన్నారు. తెలుగు మహాసభల్లో ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఫోన్ చేసి, రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాలని కోరిన సందర్భంలో ఈ డిమాండ్లు చెప్పానన్నారు. ఇవి జరగనప్పుడు భాషా సంఘం ఉన్నా ప్రయోజనం లేదన్నారు.
నన్నయతోనే తెలుగు సాహిత్య విప్లవం : యార్లగడ్డ
పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ చైతన్యరాజు నాంది పలికిన ఈ కార్యక్రమం చారిత్మాత్మకం అవుతుందన్నారు. నన్నయ మహాభారతాన్ని ఆంధ్రీకరించడంతో ఈ ప్రాంతంలో తెలుగులో సాహిత్య విప్లవం మొదలైందన్నారు. హిందీ అష్టావదానం చేసిన ఈ నగరానికి చెందిన చేబోలు శేషగిరిరావు కాంస్య విగ్రహాన్ని గతంలో తయారు చేయించానని, దానిని ప్రతిష్ఠింపజేయడానికి చర్యలు తీసుకోవాలని ఆయన చైతన్యరాజుకు విజ్ఞప్తిచేశారు.
తెలుగుపై ప్రేమతోనే నిర్వహణ : చైతన్యరాజు
తెలుగుభాష పట్ల అపా రమైన ప్రేమ ఉన్నందునే ప్రపంచ మహాసభలను ఇక్కడ నిర్వహిస్తున్నామని జీజీయూ కులపతి చైతన్యరాజు అన్నారు. గతేడాది జనవరిలో మూడు రోజులపాటు మహాసభలు జరిపించి, ఐదు రోజులపాటు శ్రీవేంకటేశ్వరస్వామి ఉత్స వాలు జోడించిన విషయాన్ని గుర్తుచేశారు. కృత్రిమ మేథ, సాంకేతికతతో అయోధ్య రాముని నమూనా ఆలయం ఏర్పాటు చేశామన్నారు.