Declaration of the Hindu Sankhara Sabha |
హైందవ శంఖారావ సభ డిక్లరేషన్
1. హిందూ దేవాలయాలకు పూర్తి స్వయం ప్రతిపత్తిని కల్పిస్తూ వెంటనే చట్ట సవరణ చేయాలి
2. హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి ఇచ్చే విధంగా చట్ట సవరణ చేసేలోగా, దేవాలయాలలో పూజ, ప్రసాద, కైంకర్య సేవలను అత్యంత భక్తిశ్రద్ధలతో నాణ్యతతో నిర్వహించేలా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి
3.హిందూ దేవాలయాలలో మరియు ఆలయాలచే నిర్వహించబడుచున్న సేవా సంస్థలలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను తక్షణం తొలగించాలి.
4.హిందూ దేవాలయ ట్రస్టు బోర్డులలో, హిందూ ధర్మంపై శ్రద్ధా భక్తులతో ధర్మాచరణ చేసే రాజకీయేతర ధార్మిక వ్యక్తులను మాత్రమే నియమించాలి
5.హిందూ దేవాలయాల ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా మరియు అన్యాక్రాంతమైన ఆస్తులను స్వాధీనం చేసుకుని, ఆలయాలకు అప్పగించే బాధ్యత ప్రభుత్వం తీసుకుని, వెంటనే చర్యలు చేపట్టాలి
6.హిందూ దేవాలయాల ఆదాయాన్ని హిందూ ధార్మిక ప్రచారానికి, హిందూ సమాజ సేవలకు, ధార్మిక సేవలకు మాత్రమే ఉపయోగించాలి. ప్రభుత్వ కార్యకలాపాలకు ఉపయోగించరాదు
7.హిందూ సమాజంపై, దేవాలయాలపై, ఆస్తులపై, వ్యవస్థలపై వివిధ పద్ధతులలో అన్యాయంగా, చట్టవిరుద్ధంగా దాడులు చేస్తున్న వారికి ప్రభుత్వం ప్రజా ప్రతినిధులు, పోలీసులు రక్షణ కల్పించే ప్రయత్నాలు చేయకూడదు. దాడులు చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకొని, శిక్ష పడేలా చూడాలి.
8.వినాయక చవితి, దసరా, హనుమజ్జయంతి వంటి ఉత్సవాలపై ప్రభుత్వం అక్రమ ఆంక్షలు, ఆర్థిక భారాన్ని విధించరాదు. ఈ ఉత్సవాలకు ముందుగా ప్రభుత్వం హిందూ సమాజ ప్రతినిధులైన హిందూ ధార్మిక పెద్దలతో, ధార్మిక సంస్థలతో కలిసి కూర్చుని మాట్లాడి ఉత్సవాల నిర్వహణపై నిర్ణయాలు చేయాలి.
9.హిందూ దేవి దేవతల ఊరేగింపులు, శోభాయాత్రల మార్గాలు, సమయాలు, తేదీలు, విధానాలపై ప్రభుత్వం అక్రమ ఆంక్షలు విధించరాదు