రామ రాజ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి బయల్దేరిన రాముడి బంగారు చరణ పాదుకలు అయోధ్యకి చేరుకున్నాయి.
కార్యకర్తలు బంగారు పాదుకలను తీసుకెళ్లి, సంగమంలో స్నానాలు చేసి అయోధ్యకు చేరుకున్నారు. తర్వాత శ్రీరామ జన్మభూమి తీర్ధక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ కార్యాలయానికి చేరుకొని, ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా శ్రీరాముడి ఎదుట బంగారు పాదుకలకు పూజలు చేసి, వీటిని స్వామి వారికి సమర్పించారు. ఈ పూజల అనంతరం మళ్లీ బంగారు పాదుకలతో హైదరాబాద్ కి చేరుకుంటుంది. ఆ తర్వాత బంగారు పాదుకలతో ఆంధ్రప్రదేశ్ లోని 30 వేల గ్రామాలకు యాత్రగా తీసుకెళ్తారు.
రామ రాజ్య ఫౌండేషన్ అధ్యక్షుడు దేవందర్ రెడ్డి మాట్లాడుతూ.. రామ దీక్ష కార్యక్రమాన్ని కూడా ట్రస్ట్ తరపున నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.14 రోజుల పాటు యాత్ర చేస్తూ అయోధ్యకి చేరుకున్నామని, ఇదో ఆధ్యాత్మిక విప్లవమని పేర్కొన్నారు. దాదాపు 50 మంది ఈ యాత్రలో పాల్గొన్నారు.