శ్రీకృష్ణ భగవానుడు బోధించిన గీత మానవ జీవితానికి ప్రతీకని సత్యగోపినాథ్దాస్ ప్రవచించారు. రాజమహేంద్రవరంలోని స్థానిక ఇస్కాన్ టెంపుల్లో గీత జయంతి సందర్భంగా గీతాయజ్ఞం నిర్వహించారు. గీతలోని శ్లోకాలను చదువుతూ యజ్ఞం పూర్తి చేశారు.
అనంతరం 1,000 మంది పేద విద్యార్థులకు భగవద్గీతలను ఉచితంగా పంపిణీ చేశారు. ఒక వస్తువు కొన్నప్పుడు దానిని ఎలా వాడాలో తెలిపే మాన్యువల్ ఉంటుంది. దాని ప్రకారం ఆ వస్తువును సులభంగా వాడవచ్చు. అదేవిధంగా శ్రీకృష్ణభగవానుడు సృష్టించిన మనుషులు ఎలా జీవించాలి, ఏ విధంగా నడుచుకోవాలి అనే అంశాలను భగవద్గీత అనే మాన్యువల్లో విపులంగా వివరించారన్నారు.
భగవద్గీత చదివితే మనిషి జన్మకు సార్థకత ఏర్పడుతుందన్నారు. నేడు ప్రపంచం అంతా మేనేజ్మేంట్ స్కిల్ నేర్పిస్తూ భగవద్గీతని అధారంగా చేసుకుందన్నారు. కాని మన వారు మాత్రమే గీతను ఎప్పుడో గుర్తుకువచ్చినప్పుడు చదువుతున్నారన్నారు. నేటి యువత గీతను చదివి అనేక విషయాలు తెలుసుకోవచ్చన్నారు. శివనాంద నిమాయదాస్, హేమ నిమాయదాస్, శ్యామంగా దాస్, రవీంద్రచైతన్యదాస్, తదితరులు పాల్గొన్నారు.