Devi shakti by: karon devega |
సృష్టి ఆరంభవమే అక్షరం నుండి సృష్టి అంతయూ అక్షర స్వరూపమే. మాతృకావర్ణ రూపము.
సహస్రారము నుండి మూలాధారము వరకు లం , వం , రం , యం,హం , ఓం , దం, క్షo వంటి శబ్దములు కలవు. ఈ శబ్దములు ఆత్యంత కాంతివంతమైనవి . వజ్రకాంతి నుండి భూకాంతి (మట్టిరంగు) వరకు వివిధమగు కాంతులలో సప్తలోకములు ప్రకాశిస్తూ ఉంటుంది, శబ్ద ఉచ్చారణము నుండి రంగులు ఏర్పాడుతుంది . ఆ కాంతి నుండే మనిషి యొక్క మనుగడను గుర్తించగలుగుతాము.. పలికే పలుకు (శబ్దం ) ఆధారంగా దానియొక్క బీజ కలియకలు వాటి పరిణామాన్ని ఆకర్షిస్తూ ఉంటుంది దానికి తగిన ఫలితమే దక్కుతుంది అందుకే మంచి మాటలు పలకాలి అంటారు ఆ మాటలని తధాస్తు అనే తధాస్తు దేవతలే సప్త చక్రాలలో ఉండే సప్త మాతృకలు...
మానసిక ఆలోచనలు ఒత్తిడి భయాలు కంగారు వీటి పరిణామం వల్ల ఆలోచనలు నుండి అరా యొక్క వర్ణాలు మారుతుంది, నిరాశతో ఆలోచనతో నెగటివ్ పవర్ ని అరా లో నింపేస్తుంది దాని పరిణామం వారికి అనారోగ్యంతో అనుకున్న పనులన్నీ వెనక్కి పోవడం చేతికి అందకపోవడం ఇలా మన ఆలోచనలు వల్లే మనిషికి మంచైనా చెడైనా జరుగుతుంది..
ప్రాణి యొక్క ప్రతి అణువులో ప్రతి నాడికి అనుసంధానంగా బీజాలు ఉంటాయి పలికే శబ్దాన్ని కదలికన్ని బట్టి స్పందన కలుగుతుంది.
మంత్రం కానీ ఒక సంకల్పం గాని పదే పదే పలకడం వల్ల ప్రకృతి లోని శక్తీ అకర్శించి కార్యసిద్దిని కలిగిస్తుంది మంత్రం అనేది బీజం అనేది ఒక అస్త్రం లాంటిది ఆ అస్త్రం మంచికి చెడుకు కారణం అవుతుంది ఎలా వినియోగిస్తాము అనేది మన పరిస్థితి పైన ఆధార పడి ఉంటుంది.. మంత్రం చెప్పే ముందు పూజలు దీక్షలు చేసే టప్పుడు సంకల్పం చెప్తాము కారణం భగవంతుడు కి తెలియదు అని కాదు మన ఆలోచనలో మంచి సంకల్పం తో మెదలు పెట్టడం కోసం ఆ పూజకి ఫలితాన్ని ఇచ్చే తధాస్తు దేవతలు మనలోనే ఉన్నారు కాబట్టి సంకల్పం చేప్పుకుని చేస్తాము..
కొన్ని బీజ అక్షరములు అర్థం తెలుసుకుందాము
- హ్రీం : శక్తి బీజము (మాయ బీజం ప్రకృతి శక్తికి దగ్గర చేస్తుంది తెలివి వివేకం నాయకత్వం లక్షణాలు అభివృద్ధికి తోడ్పడుతుంది
- శ్రీం : లక్ష్మి బీజము (మంచి ఆలోచనలు కార్యసిద్ధికి కావాల్సిన శక్తిని అనుగ్రహన్ని ఇస్తుంది
- క్లీం : కామ బీజము (సంకల్ప సిద్దిని, కార్యసిద్ధికి కావాల్సిన శక్తిని అనుగ్రహిస్తుంది
- క్రీం : కాళీ బీజము ( ధైర్యాన్ని, కర్మ ప్రక్షాళన, అధికారం, అరహత ఆయువు వృద్ధి ఇలా ఎన్నో శక్తులను ప్రకృతి నుండి ఆకర్షస్తుంది
- దుం : దుర్గ బీజము ( పోరాడే శక్తిని బలాన్ని చెడుని ఎదిరించే దైరన్ని ఈ ధ్వని వల్ల ఆఖర్శించబడుతుంది..
- ఐం : సరస్వతి బీజము ( తెలివిని, వివేకం, ఆలోచన పరిజ్ఞానం, అభివృద్ధికి కారణం అవుతుంది.
- హౌం: శివ బీజము ( మృత్యువును జయించే శక్తి ని ఇస్తుంది శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచుతుంది.
- గం : గణపతి బీజము ( విజ్ఞలను తొలగిస్తుంది ఆటంకాలు ఆదిగమించి కార్య సిద్దిని అనుగ్రహిస్తుంది ఒక పని పూర్తి చేయడానికి కావాల్సిన శక్తిని అనుగ్రహిస్తుంది
ఇలా చెప్తూ వెళ్తే ప్రతి అక్షరము బీజమే వాటిని మంత్రాలుగా ఉపయోగించడం వల్ల ప్రకృతి నుండి ఆ విశ్వాప్రాణ శక్తిని ఆకర్షస్తుంది.. అయితే ఏక బీజం యతి అనుష్టానం, గృహస్తుల్ ఏక బీజ మంత్రాలు ప్రయోగించకండి.. మంత్రం గురువులు ఆదేశం సూచన పరంగా చేయడమే ఉత్తమం..
దేహం పంచాభూతాలతో అనుసంధానంగా ఏర్పాడి ఉంటుంది పంచ ప్రాణాలు పంచవాయువులతో ప్రకృతి తో మమేకం అయి ఉంటుంది అందుకే ధ్వని (శబ్దనికి ) త్వరగా స్పందన ఉంటుంది..
- లం ; పృధ్వి
- వం : జలము
- రం : అగ్ని
- యం : వాయు
- హం : ఆకాశము
ఒక్కో చక్రానికి ఉన్న దళాలలో ఉండే బీజలనే అక్షరమాల అంటారు వాటిని జపం చేయడం మంత్రం తో సంపుటితం చేసి జపం చేయడం వల్ల చక్రాలు శుద్ధి అవుతుంది ప్రకృతి నుండి విశ్వప్రాణ శక్తీని అధికంగా ఆకర్షస్తుంది.