కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామాలయంలో వచ్చే ఏడాది ఏప్రిల్ 6 నుంచి 14 వరకు శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నామని టిటిడి ఉప కార్యనిర్వహణాధికారి పి.వి.నటేష్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు.
అదే నెల 5న ఉత్సవాలకు అంకురార్పణ చేస్తామని, 6న ధ్వజారోహణం, 10న గరుడ సేవ, 11న సీతారాముల కల్యాణ మహోత్సవం, 12న రథోత్సవం, 14న పుర్ణాహుతి తదితర కార్యక్రమాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. జానకీరాముల పరిణయ ఘట్టం నిర్వహణకు అవసరమైన 100 కిలోల ముత్యాలను భక్తులు, దాతల ద్వారా సేకరిస్తామని తెలిపారు.