ఏ సిరిధాన్యం ఏ అంగాలను శుద్ధి చేస్తుంది? ఏ ఆరోగ్య సమస్యలను పరిష్కరిస్తుందో తెలుసుకుందాం!
Foxtail Millet |
1. కొర్రలు, కొర్ర బియ్యం - Foxtail Millet
ఐదు బరి దాన్యాలలో అత్యంత సమతుల్యత కలిగిన ధాన్యం కొర్రలు. ఇవి నరనాడులను, శ్వాసకోశ వ్యవస్థను శుద్ది చేస్తాయి. మెదడుకు సంబందించిన రోగాలను, వృద్ధాప్య సంబంధిత మతిమరుపును (Alzheimer'), పార్కిన్సన్స్ వ్యాధిని, మూత్రాశయ ఇబ్బందులను, ఊఎరితిత్తులకు సంబంధించిన రోగాలను, కీళ్ల నొప్పులను, ఎముకలకు సంబందించిన ఇబ్బందులను, ఊలఎరితిత్తులకు సంభవించే ఇన్సెక్షన్లను, న్యుమోనియాను, మధుమేహ రోగులు బాధపడే అరికాళ్ళ మంటలను, స్పర్శ కోల్పోవడం వంటి పరిస్థితులను నయం చేస్తాయి. నిద్రలో పక్కలో మూత్రవిసర్జన చేసే పిల్లలకు కొర్రలు తినిపిస్తే మూత్రాశయ నియంత్రణ మెరుగుపడి ఆ ఇబ్బంది నుండి బయట పడతారు. ముఖ్య గమనిక; పాలిచ్చే తల్లులు వీటిని తినకూడదు.
Little Millet |
2. సామలు, సామ బియ్యం - Little Millet
సిరి ధాన్యాలు ఐదింటిలో అతిచిన్న ధాన్యం సామలు. ఈ ధాన్యం జననాంగాలను శుద్ది చేసీ శక్తి కలిగి ఉంటాయి. పీసీఓడి, ధైరాయిడ్, వంధ్యత్వం (infertility) మొదలగు హార్మోన్ల అసమతూలనల వలన కలిగే సమస్యలకు, మూత్రపిండ వ్యాధులకు సామలు ఉపశమనం కలిగిస్తాయి. ముఖ్య గమనిక: ఈ ధాన్యం మృదువుగా ఉంటాయి. అందుచేత తొమ్మిది నెలలు నిండిన పిల్లలకు మొదటి ఘన ఆహారంగా ఈ ధాన్యం తినిపించాలి. అంటే మీ ఇంట్లో పిల్లలకు ఈ ధాన్యంతో అన్నప్రాసన చెయ్యవచ్చు.
అరిక బియ్యం - Kodo Millet |
3. అరికలు, అరిక బియ్యం - Kodo Millet
ఈ సిరిధాన్యం రక్తం తయారు అయ్యే ఎముకల మజ్ఞను శుద్ధి చేస్తాయి. రక్తహీనతను నయం చేయటానికి, విష జ్వరాల కారణంచేత క్షీణించిన రక్త ఫలకికల (Platelet's) సంఖ్యను పెంచేందుకు, అలర్జీలను దూరం చేసేందుకు, ఎస్.ఎల్.ఈ. వంటి ఆటో ఇమ్యూన్ రుర్మతలను నయం చేయటానికి, రోగనిరోధకశక్తిని పెంచేందుకు, మన దేహంలో రక్షణ వ్యవస్థను దృధపరిచేందుకు, డయాలిసిస్ అవసరం ఉన్న వారికి అరికలు ఎంతగానో ఉపయోగపడతాయి.
ఊద బియ్యం - Barnyard Millet |
4. ఊదలు, ఊద బియ్యం - Barnyard Millet
కాలేయాన్ని శుద్ధి చేసే శక్తి కలిగిన ధాన్యం ఊదలు. మూత్రపిండాల వంటి మృదువైన అంగాలన్నిటిని శుద్ధి చేస్తాయి. కామెర్లు, కాలేయానికి సోకే ఇన్ఫెక్షన్లు, హెవటైటిన్-బి, హెపటైటిన్-సి వంటి కాలేయానికి సోకే వ్యాధులకు, పెద్ద వారిలో మూత్రాశయ నియంత్రణ కొరకు, పిత్తాశయంలో రాళ్లను నిర్మూలించేందుకు, టైఫాయిడ్ వంటి విషజ్వరాలు నయం కావడానికి ఊదలు బాగా పనిచేస్తాయి.
Brown top Billet |
5. అండు కొర్రలు బియ్యం - Brown top Billet
తలపైన జుట్టు నుండి కాలి గోళ్ళ వరకు అన్ని అంగాలను శుద్ధి చేయగలిగే అద్భుత ధాన్యం అండు కొర్రలు. కొర్రల వల్ల కలిగే అన్ని ఉపయోగాలు ఈ ధాన్యంలోనూ లభిస్తాయి. అవేకాక మలబద్ధకం, గ్యాస్ట్రిక్ అల్సర్స్, పైల్స్, మొదలగు అన్నవాహిక సంబంధిత అన్ని ఇబ్బందులను దూరం చేస్తాయి. ఎర్జిమా, సొరియాసిస్ వంటి చర్మ వ్యాధులను కూడా దూరం చేస్తాయి. అన్ని రకాల క్యాన్సర్లకు ఉపశమనం కలిగించే శక్తి కేవలం ఈ ధాన్యంలో ఇమిడి ఉన్నది.
సంపూర్ణ ఆరోగ్యం కొరకు ఈ ఐదు ధాన్యాలను తవ్చుక మూలాహారంగా తీనుకోవాలి.
100 గ్రాముల ధాన్యాల్లో పోషకాలు, పీచు పదార్థం ఎంత? |