Christian pastor insults Hinduism at AIADMK Christian celebrations |
అన్నా డీఎంకే నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో క్రిస్టియన్ పాస్టర్ హిందూ ధర్మాన్ని అవమానిస్తూ వ్యాఖ్యలు చేశారు. మొదట ఆడం, ఏవ్ వుండేవారని ఆ తర్వాత క్రిస్టియానిటీ పుట్టిందన్నారు.
దీని తర్వాత ఇస్లాం ఉనికిలోకి వచ్చిందని, ఆ తర్వాత హిందూ ధర్మం వచ్చిందంటూ నిరాధార వ్యాఖ్యలు చేశారు. అందరూ ఒకే తల్లికి జన్మించారని, దీనిని అర్థం చేసుకుంటే మత ఆధారిత, కుల ఆధారిత హింస దేశంలో వుండదంటూ ధర్మ ప్రబోధాలు చేశారు.అమెరికాలో నాయుడు గారు ఎలా వున్నారు? అని అడగడం వుండదని, న్యూజిలాండ్ లో ముదళియార్ ఎలా వున్నారు? అని అడగడం వుండదని, నలుపు, తెలుపు ఆధారంగానే వుంటుందన్నారు. కానీ… ఒక్క భారత్ లో మాత్రమే వర్ణ వ్యవస్థ అంటూ భేదం వుంటుందన్నారు.
‘‘ ఓ దేవుడు ప్రేమను పంచడానికి భూమిపైకి వచ్చాడని, అతని పేరే ఏసుక్రీస్తు అని పేర్కొన్నారు. ఎవరైతే నా దగ్గరికి వస్తారో..వారిని దూరం చేయను. ఆయన మిమ్మల్ని దూరం పెట్టడు. వేరే చోటికి వెళ్తే అప్పుడు దూరం పెడతాడు. ఆయన దగ్గరికి రాలేరు. వేరే చోట నిలుచొని శుక్లాంబరధరం అంటూ చదువుకోవాలి. అదే ఇక్కడైతే మిమ్మల్ని ఆహ్వానిస్తాం. వేదిక దగ్గరికి రావొచ్చు. శిలువ దగ్గరికి రావొచ్చు. నేను మిమ్మల్ని సృష్టిస్తున్నా. మీరంటే చాలా ప్రేమ. మిమ్మల్ని దూరం పెట్టను.’’ అంటూ పాస్టర్ పేర్కొన్నారు.
అంతేకాకుండా రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కూడా పాస్టర్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రాబోయే అసెంబ్లీ ఎన్నికల సమయంలో అన్నాడీఎంకే బీజేపీతో పొత్తు వుండదని ప్రకటిస్తే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే కచ్చితంగా అధికారంలోకి వస్తుందంటూ వ్యాఖ్యానించారు. ఎడప్పాడి పళని స్వామి సారథ్యంలోనే సీఎం కుర్చీ కైవసం చేసుకుంటుందని తెలిపారు.రాబోయే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా క్రైస్తవులందరూ అన్నాడీఎంకే తరపున చురుగ్గా ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.