70 percent of the Sadhus in this akhara are educated |
సనాతన ధర్మ పరిరక్షణ కోసం భావి తరాలకు ధర్మాన్ని పురాణ గ్రంథాలను అందించడానికి ఏర్పడిన సంస్థ ఆఖరా. వీటిల్లో అనేక రకాలు ఉన్నాయి.
అందులో ఒకటి శ్రీ పంచాయతీ తపోనిధి నిరంజనీ అఖారా. ఇందులో అత్యధిక సంఖ్యలో చదువుకున్నవారే.. ఈ అఖారాలోని సాధువులలో ప్రొఫెసర్లు, వైద్యులు, నిపుణులు ఉన్నారు. ఈ అఖారా శైవ సంప్రదాయానికి చెందినది. ఈ అఖారా అత్యంత ధనిక అఖారాలలో ఒకటి అని కూడా తెలుస్తోంది. ప్రయాగ్‌రాజ్, దాని పరిసర ప్రాంతాలలో శ్రీ పంచాయితీ తపోనిధి నిరంజని అఖారా సంస్థకు అపారమైన సంపద ఉంది.
కొత్త సంవత్సరం 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభ మేళాను నిర్వహించనున్నారు. ఈ మహా కుంభ మేళాలో దేశంలోని మొత్తం 13 అఖారాలకు చెందిన ఋషులు, సాధువులు సమావేశం కానున్నారు. ఈ సాధువులు పవిత్ర త్రివేణీ సంగమ ప్రాంతంలో స్నానం చేస్తారు. ఈ అఖారాలలో ఒకటి నిరంజని అఖారా. ఈ అఖారా శివుని కుమారుడైన కార్తికేయుడిని ఇష్ట దైవంగా భావించి పూజిస్తారు. ప్రస్తుతం నిరంజని అఖారా మహా మండలేశ్వరుడు డాక్టర్ సుమనానంద గిరి. ఈ అఖారా ప్రధాన కార్యాలయం ప్రయాగ్‌రాజ్‌లో ఉంది. ఈ అఖరా లో ఉన్న మహంతులు, దిగంబర సాధువులు, అఖారా మహామండలేశ్వరులు. నిరంజని అఖారాల గురించి తెలుసుకుందాం…
గుజరాత్లో స్థాపించబడిన నిరంజని అఖారా
నిరంజని అఖారా 726 ADలో గుజరాత్‌లోని మాండ్విలో స్థాపించబడింది (విక్రమ సంవత్సరం 960). ఈ అఖారా ఆశ్రమాలు ఉజ్జయిని, హరిద్వార్, త్రయంబకేశ్వర్, ఉదయపూర్లలో ఉన్నాయి. ఈ అఖారా కు చెందిన మతపరమైన జెండా కుంకుమ రంగులో ఉంటుంది. ఈ అఖారా పూర్తి పేరు శ్రీ పంచాయితీ తపోనిధి నిరంజని అఖారా. ఈ అఖారా ప్రధాన ఆశ్రమం హరిద్వార్‌లోని మాయాపూర్‌లో ఉంది. ఈ అఖారా దేశంలోని ప్రధాన అఖారాలలో ఒకటిగా లెక్కించబడుతుంది. జునా అఖారా తర్వాత అత్యంత శక్తివంతమైన అఖారా నిరంజనీ అఖారా అని నమ్ముతారు.
అత్యధిక సంఖ్యలో విద్యావంతులైన సన్యాసులు
శ్రీ పంచాయితీ తపోనిధి నిరంజని అఖారాలో అత్యధికంగా విద్యావంతులైన సాధువులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అఖారాలోని సాధువులలో ప్రొఫెసర్లు, వైద్యులు సహ పలు రంగాల్లోని నిపుణులు ఉన్నారు. ఈ అఖారా శైవ సంప్రదాయానికి చెందినది. ఈ అఖారాలోని 70 శాతం మంది సాధువులు ఉన్నత విద్యను అభ్యసించినవారే. ఈ అఖారా అత్యంత ధనిక అఖారాలలో ఒకటి అని తెలుస్తోంది. ఈ అఖారా ప్రత్యేకత దానిలోని విద్యావంతులైన సన్యాసులు. ఈ అఖారాలో ఐఐటీ నుంచి పట్టపుచ్చుకున్న కొందరు సాధువులు ఉన్నారు.