Ashwagandha |
అశ్వగంధతో 7 అద్భుతమైన ప్రయోజనాలు..!
అశ్వగంధను తీసుకోవడం వల్ల ఎలాంటి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. నిత్యం ఉరుకుల పరుగుల బిజీ జీవితంలో చాలా మంది ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇది డిప్రెషన్కు కూడా దారి తీస్తోంది. కనుక ఈ సమస్యల నుంచి బయట పడాలంటే అందుకు అశ్వగంధ పనిచేస్తుంది. రోజూ రాత్రి ఒక గ్లాస్ పాలలో అర టీస్పూన్ అశ్వగంధ పొడిని కలిపి తాగుతుంటే మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. డిప్రెషన్ నుంచి బయట పడవచ్చు.
2. అశ్వగంధలో అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మెటబాలిజంను పెంచుతాయి. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఫలితంగా కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. అధిక బరువును తగ్గించుకోవాలని చూసేవారికి అశ్వగంధ ఎంతగానో పనిచేస్తుంది.
3. కీళ్ల నొప్పులు, వాపులు ఉన్నవారు అశ్వగంధను తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది. ఆ సమస్యల నుంచి బయట పడవచ్చు. రోజూ ఉదయం, సాయంత్రం అశ్వగంధ పొడిని పాలలో కలిపి తీసుకుంటే ఫలితం ఉంటుంది.
4. అశ్వగంధలో ఉండే ఔషధ గుణాలు తలనొప్పి, హైబీపీ సమస్యలను కూడా తగ్గిస్తాయి. కనుక ఈ సమస్యలు ఉన్నవారు అశ్వగంధను తీసుకుంటే మేలు జరుగుతుంది.
5. జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను పెంచడంలో అశ్వగంధ బాగా పనిచేస్తుంది. అలాగే దీంతో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దీంతో సీజనల్ దగ్గు, జలుబు, జ్వరం వంటివి తగ్గిపోతాయి.
6. అశ్వగంధలో క్యాన్సర్కు వ్యతిరేకంగా పనిచేసే గుణాలు ఉంటాయి. అందువల్ల క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు. అలాగే షుగర్ లెవల్స్ నియంత్రణలోకి వస్తాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి.
7. నిద్రలేమి సమస్య ఉన్నవారు అశ్వగంధను తీసకోవడం వల్ల నిద్ర చక్కగా పడుతుంది. అశ్వగంధ పురుషుల్లో టెస్టోస్టిరాన్ను పెంచుతుంది. దీంతో వారిలో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. స్త్రీలకు నెల నెలా వచ్చే సమస్యలు తగ్గుతాయి.
అశ్వగంధ వేర్లు |
ఆయుర్వేద వైద్యులు, - Dr.వెంకటేష్ +91-9392857411