Bhasma Dharana |
భస్మధారణ
ఈ భస్మధారణకే శిరోవ్రతమని పేరు, ఈ భస్మధారణ వలన మహాపాపాలు కూడా నశిస్తాయి. కుడిచేతి మధ్యమ, అనామికా వేళ్ళ సాయంతో విభూతిని చేతిలోకి తీసుకోవాలి. నుదుటిపై పెట్టుకోవడం కూడా ఎడమవైపు నుండి కుడివైపుకు విభూతి రేఖలు తీర్చిదిద్దాలి. అప్పుడు అంగుష్టముతో విభూతి రేఖలపై కుడివైపు నుండి ఎడమవైపుకు మూడు రేఖలుగా ధరించడాన్ని త్రిపుండ్రం అంటారు. త్రిపుండ్రం అంటే అడ్డబొట్టు అని అర్థం.
- గృహస్తు భస్మాన్ని నీళ్ళతో తడిపి, నుదుటిమీద, ఉదరంపైన, చేతులమీద పెట్టుకోవాలి. మంత్రాలు ఉచ్చరించడం చేతకానివారు ఈ చిన్న వాక్యాన్ని అయినా స్మరించాలి. లేదంటే, కనీసం "నమశ్శివాయ" అనే పంచాక్షరీ మంత్రాన్ని జపించి, భస్మధారణ చేయాలి.
- స్త్రీలు, స్వాములు నీళ్ళతో తడపని పొడి విభూతిని ధరించాలని శాస్త్రాలు చెప్తున్నాయి.
- విభూతి ధరిస్తే సకల శారీరక,మానసిక రోగాలు తొలగిపోయి, పరిపూర్ణ ఐశ్వర్యం సిద్ధిస్తుంది.
పవిత్రమైన విభూతిని ఎలా ధరించాలో, ఏ అంగాలలో ధరిస్తే ఏయే ఫలితాలు సిద్ధిస్తాయో చూద్దాం.
- ఫాలభాగం- పీకలవరకు చేసిన పాపాలు తొలగుతాయి.
- వక్షస్థలం-మనస్సుతో తెలిసి చేసిన పాపం నశిస్తుంది.
- నాభి- కడుపు దాకా చేసిన పాప నిర్మూలన జరుగుతుంది.
- భుజాలు- చేతితో చేసిన పాపం నశిస్తుంది.
- భస్మం - శ్వేత వర్ణము
- విభూతి - కపిలవర్ణము,
- భసితము -కౄష్ణ వర్ణము
- క్షారము - ఆకాశవర్ణము
- రక్షయని - రక్తవర్ణము
హోమ భస్మం
- హోమ భస్మం (విభూతి) ధారణతో నవగ్రహ బాధలు తొలగిపోతాయి.
- హోమ భస్మ ధారణతో మనిషిలో ఉండే అన్ని రకాల దోషాలు నివారించబడతాయి.
- హోమ భస్మ ధారణతో దేవుని అనుగ్రహం కలిగి అన్ని పలును నిరాటకంగా జరుగుతాయి.
- భస్మ ధారణతో అన్ని రకాల గోచర, అగోచర, దృశ్య, అదృశ్య రోగాలు తొలగిపోతాయి.
వివిధ హోమభస్మాలు చేసే మేలు:
- శ్రీ మహాగణపతి హోమంలోని భస్మాన్ని ఉపయోగిస్తే అన్ని పనులు నిరాటంకంగా జరుగుతాయి.
- శ్రీ సుబ్రహ్మణ్య స్వామి హోమంలోని భస్మాన్ని ధరిస్తే ఇంట్లో ఉండే కలహాలు తొలగి అందరికీ శాంతి లభిస్తుంది.
- శ్రీ దుర్గా హోమంలోని భస్మాన్ని ధరిస్తే సకల శత్రువుల నాశనం జరిగి ప్రశాంతత గల జీవితాన్ని సాగించవచ్చు.
- శ్రీ ధన్వంతరి హోమంలోని భస్మాన్ని ధరిస్తే అన్ని రోగాలు నివారించబడి దేహం వజ్రసమానంగా మారుతుంది.
- శ్రీ నవగ్రహ హోమంలోని భస్మాన్ని ధరిస్తే ఎంటువంటి గ్రహాల చెడు ప్రభావం ఉండదు.
- శ్రీ మహా మృత్యుంజయ హోమంలోని భస్మంతో అన్ని రకాల అకాల మృత్యువులు తొలగిపోతాయి
- శ్రీ లలిత త్రిపుర సుందరి, శ్రీ రాజరాజేశ్వరి దేవి, శ్రీ గాయత్రి దేవి హోమం, శ్రీ చక్ర హోమాల్లోని భస్మాన్ని ధరిస్తే అన్ని పనుల్లో విజయం సిద్ధించడంతో పాటు జీవితాంతం సౌఖ్యదాయక జీవితాన్ని కలిగి వుంటారు.
- శ్రీ సుదర్శన హోమం భస్మధారణతో శత్రువుల నిర్మూలనం జరుగుతుంది.
- శ్రీ లక్ష్మీ నారాయణ హోమంలోని భస్మాన్ని ధరిస్తే భార్యాభర్తల మధ్య స్పర్ధలు తొలగిపోతాయి.
హోమ భస్మధారణతో ఎటువంటి మాంత్రికుల బాధ, దృష్టి, శాపం, గ్రహ బాధలు వేధించవు. హోమభస్మాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేలపై ఉంచకూడదు.
విభూతి స్నానం అంటే ఏమిటి?
స్నానం అంటే ఒంటి మీద నీళ్ళు పోసుకోవడం. ఒంటి నిండా విభూతి పూసుకుంటే దానిని విభూతి స్నానం అంటారు.