రత్నములు ఏ వ్రేలుకు ధరించాలి?
అన్ని వ్రేళ్ళకు రత్నములు లేదా ఉంగరములు ధరించరాదు.
మన చేతికి ఉన్న 5 వ్రేళ్ళలో బ్రొటనవ్రేలు, చూపుడు వ్రేలు, మధ్య వ్రేలు, ఉంగరము వ్రేలు, చిటికెన వ్రేలు.
హస్తసాముద్రిక శాస్త్రము గ్రహ కారకత్వములు వ్రేళ్ళలో, అరచేతిలో , రేఖలలో చెప్పబడింది.
- బ్రొటన వ్రేలు - శుక్రుడి వ్రేలు
- చూపుడు వ్రేలు - గురుడి వ్రేలు
- మధ్య వ్రేలు - శని వ్రేలు
- ఉంగరము వ్రేలు - రవి వ్రేలు
- చిటికెన వ్రేలు - బుధుడి వ్రేలు
కుజ చంద్ర రాహు కేతువులకు అరచేతి మరియు మణికట్టు ప్రాంతములో స్థానములు చెప్పబడినవి. పై వాటిని అనుసరించి ఆయా వ్రేలుకు ఆయా గ్రహ రత్నము ధరించమని చెపుతున్నారు.
ఇది ముమ్మాటికీ సరియైనది కాదు.
శక్తి కేంద్రములు అరచేతిలో ఉంటాయి వీటికి సంబందించిన రహస్య విషయములు తెలియక పండితులు రత్నధారణ విషయము చెప్పారు.
స్త్రీ _ పురుషులలో .......
- పురుషులు మొదలు కుడిచేతికి రత్నములు ధరించాలి ఆ తదుపరి ఎడమ చేతికి ధరించవలెను.
- స్త్రీలు మొదలు ఎడమచేతి రత్నములు ధరించాలి ఆ తదుపరి కుడిచేతికి ధరించవలెను.
- 12 లగ్నజాతకులకు 4 లేదా 5 శుభ గ్రహములు కలవు. ఒకరికి 4 లేదా 5 రత్నములు మాత్రమే ధరించుటకు వీలు కలదు.
- నవరత్నములు ఎవరు ధరించకూడదు ధరించిన కీడు తప్పక కలుగును.
ఏ వ్రేలుకు రత్నము ధరించాలి.......?
- మొదటి రత్నము - ఉంగరము వ్రేలుకు పురుషులు కుడి చేతికి, స్త్రీలు ఎడమ చేతికి ధరించాలి.
- రెండవ రత్నము - మధ్య వ్రేలుకు పురుషులు కుడి చేతికి, స్త్రీలు ఎడమ చేతికి ధరించాలి.
- మూడవ రత్నము - ఉంగరము వ్రేలుకు పురుషులు ఎడమ చేతికి, స్త్రీలు కుడి చేతికి ధరించాలి.
- నాల్గవ రత్నము - మధ్య వ్రేలుకు పురుషులు ఎడమ చేతికి, స్త్రీలు కుడి చేతికి ధరించాలి.
- ఐదవ రత్నము - రాహువు లేదా కేతువు సంబంధ రత్నము ఉంటుంది. వీటిని ఖంఠమునందు లేదా మధ్య వ్రేలుకు ధరించాలి. పురుషులు కుడి చేతికి , స్త్రీలు ఎడమ చేతికి ధరించాలి.
చూపుడు వ్రేలుకు ఏ రత్నము లేదా ఉంగరము ధరించకూడదు. గురు వ్రేలుకు రత్నము లేదా ఉంగరము ధరించిన మానసిక ఛిద్రములు కోపము, అవేశము, అహంకారము, గర్వము ఎక్కువ కలుగును.
రత్నము యొక్క పరిమాణము ఎవరి శక్తి కోలది వారు ధరించుట చేయవచ్చు. 2 క్యారెట్లు, 3 క్యారెట్లు, 5 క్యారెట్లు అని ఏమి అవసరము లేదు. ఎవరి శక్తి కొలది వారు ధరించవచ్చు.