Durga Devi |
దుర్గాదేవి ద్వాత్రింశన్నామావాళి
దరిద్రం, భయం కష్టాల్లో ఉన్నవారు దుర్గమ్మని ఈ 32 నామాలతో పూజించండి.. అద్భుత ఫలితాలు పొందండి.
అర్ధంతో దుర్గాదేవి ద్వాత్రింశన్నామావాళి.
దుర్గా దుర్గార్తి శమణీ, దుర్గాపద్వినివారిణీ
దుర్గమచ్చేదినీ, దుర్గసాధినీ, దుర్గనాశినీ
దుర్గతోద్ధారిణీ, దుర్గనిహంత్రీ, దుర్గమాపహ
దుర్గమదేజ్ఞానదా, దుర్గ దైత్యలోకదవానలా
దుర్గమ, దుర్గమాలోక, దుర్గమాత్మస్వరూపిణీ
దుర్గమార్గాప్రద, దుర్గమావిద్యా, దుర్గమాశ్రిత
దుర్గమజ్ఞానసంస్థాన, దుర్గమధ్యానభాసిని
దుర్గమోహ & దుర్గమగ, దుర్గమర్థస్వరూపిణీ
దుర్గమాసుర సంహంత్రి, దుర్గమాయుధదారిణీ
దుర్గమాంగీ, దుర్గమత, దుర్గమ్య, దుర్గమేశ్వరీ
దుర్గభీమా, దుర్గభామా, దుర్లభా, దుర్గధారిణీ..
ఇవి దుర్గాదేవి 32 నామాలు.
32 దుర్గాదేవి నామాలకు అర్ధం:
- దుర్గా: భక్తుల చుట్టూ ఒక కోటలా ఉండి కాపాడే తల్లి నీకు వందనం.
- దుర్గార్తిశమణీ: కష్టాలను శమింపచేసేతల్లి నీకు వందనం.
- దుర్గాపద్వినివారిణీ: ఆపదలను నివారించే తల్లీ నీకు వందనం.
- దుర్గమచ్ఛేదినీ: కష్టాలను ఛేదించే తల్లీ నీకు వందనం.
- దుర్గసాధినీ: దుర్గమమైనది సాధించే తల్లీ నీకు వందనం.
- దుర్గనాశినీ: కష్టాలను నాశనం చేసే తల్లీ నీకు వందనం.
- దుర్గతోద్దారిణీ: దుర్గాలలో కూరుకుపోయిన వారిని రక్షించే తల్లీ నీకు వందనం.
- దుర్గనిహంత్రీ: మనదెగ్గరికి కష్టాలు రాకుండా నియంత్రించే తల్లీ నీకు వందనం.
- దుర్గమాపహ: కష్టాలను వినాశనం చేసే తల్లీ నీకు వందనం.
- దుర్గమదేజ్ఞానదా: రహస్యమైన ఆత్మజ్ఞానం లాంటి జ్ఞానాన్నిచ్చే తల్లీ నీకు వందనం.
- దుర్గదైత్యలోకదవానలా: కష్టాలనే రాక్షసుల సమూహాన్ని దహించే తల్లీ నీకు వందనం.
- దుర్గమ: అమ్మను సాధించడానికి ఆశక్యమైన తల్లీ నీకు వందనం(తేలికగా దర్శనం ఇవ్వని తల్లి).
- దుర్గమాలోక: చర్మచక్షువులు,పంచేంద్రియాలతో చూడలేని తల్లీ నీకు వందనం.
- దుర్గమాత్మస్వరూపిణీ: మనలోనే వసిస్తూ లభించడానికి సాధ్యం కాని ఆత్మస్వరూపమైన తల్లీ నీకు వందనం. అంటే మనలోపల ఉన్నా సరే మాటలలో వర్ణించలేని, కళ్ళతో చూడలేని, తెలుసుకోలేని తల్లి స్వరూపంమని అర్ధం
- దుర్గమార్గాప్రదా: రహస్య మార్గానికి త్రోవచూపేతల్లీ నీకు వందనం.
- దుర్గమవిద్యా: రహస్యమైన విద్యాస్వరూపమైన తల్లీ నీకు వందనం(శ్రీవిధ్యా స్వరూపం).
- దుర్గమాశ్రిత: దుర్గాన్ని ఆశ్రయించి ఉన్న తల్లీ నాకు వందనం (శ్రీచక్రం).
- దుర్గమజ్ఞానసంస్థాన: అలవికాని జ్ఞానానికి సంస్థాన అంటే సాధ్యంకాని జ్ఞానానికి తల్లీ నీకు వందనం.
- దుర్గమధ్యానభాసిని: ధ్యానం ద్వారా సంపాదించే జ్ఞానంలో భాసించే తల్లీ నీకు వందనం.
- దుర్గమోహ: ఆపదలను లాగేసే తల్లీ నీకు వందనం.
- దుర్గమగ: కష్టాలను పరిష్కరించే తల్లీ నీకు వందనం.
- దుర్గమార్థస్వరూపిణీ: ఈ పదానికి రెండు అర్థాలున్నాయి. ఒకటి మనలోని చెడు ఆలోచనలకు శత్రువైన తల్లి అని.. రెండోది దుర్గమమైన అర్ధాలుగల తల్లీ నీకు వందనం.
- దుర్గమాసురసంహంత్రీ: దుర్గమాసురుడైన రాక్షసుడిని సంహరించిన తల్లీ నీకు వందనం.
- దుర్గమాయుధదారిణీ: దుర్గమమైన ఆయుధాలను ధరించిన తల్లీ నీకు వందనం.
- దుర్గమాంగీ: ఊహించలేని దివ్యమైన అంగాలు కల తల్లీ నీకు వందనం.
- దుర్గమత: కల్మషాలను దూరం చేసే తల్లీ నీకు వందనం.
- దుర్గమ్య: సాధించడానికి శక్యం కానీ తల్లీ నీకు వందనం.
- దుర్గమేశ్వరి: విఘ్నాలకు అధినాయకురాలైన తల్లీ నీకు వందనం.
- దుర్గభీమా: భీషణమైన పరాక్రమం కల తల్లీ నీకు వందనం.
- దుర్గభామా: దుర్గ అనే స్త్రీ రూపం లోని తల్లీ నీకు వందనం.
- దుర్గభా: ప్రకాశం గల తల్లీ నీకు వందనం.
- దుర్గదారిణీ: రహస్యాన్ని ఛేదించే తల్లీ నీకు వందనం.
ఓం నమో దుర్గాయ నమః అంటూ ఈ 32నామాల దుర్గాదేవి ద్వాత్రింశన్నామావాళిని 108 సార్లు పారాయణం చేస్తే సర్వ దరిద్రాలు తొలగుతాయి అనేది పురాణాల కథనం.. భక్తుల నమ్మకం..
శ్రీ మాత్రే నమః
మీ...వేద, శాస్త్ర స్మార్త,పురోహిత పరిషత్, శాంతి నగర్,ఖాధికాలని, తిరుపతి