ఆలయాల ఖ్యాతి మరింత ఇనుమడింపజేసేలా వంశపారంపర్య ధర్మకర్తల పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సూచించారు. రాష్ట్ర సచివాలయంలో నిన్న మంత్రి వివిధ ఆలయాల వంశపారంపర్య ధర్మకర్తలతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, ఆలయాల్లో వైదిక సంప్రదాయాలు పాటించడం, ఆధ్యాత్మికత పెంపొందించడం, పరిశుభ్రత తదితర అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, ఇందుకు ధర్మకర్తలు సహకారం అందించాలని కోరారు. భక్తులకు తొలి ప్రాధాన్యమిస్తూ ఆలయాల నిర్వహణ కొనసాగించాలని మంత్రి సూచించారు.