పుత్రులు ఏడు రకాలుగా జన్మిస్తారు:
- పూర్వ జన్మలో తన సొమ్మును దాచమని ఒక వ్యక్తికి ఇచ్చి, అది తీసుకోకుండానే మరణించినవాడు, తాను దాచిన సొమ్ము తీసుకోవడానికి ఆ ఇంట్లో పుత్రుడుగా జన్మిస్తాడు.
- తాను పూర్వ జన్మయందు బాకీపడిన అప్పును (ఋణాన్ని) చెల్లించుటకు పుత్రుడుగా జన్మిస్తాడు.
- పూర్వ జన్మలోని శత్రుత్వం తీర్చుకోవడానికి ఈ జన్మలో పుత్రునిగా జన్మిస్తాడు.
- పూర్వ జన్మలో తనకు ఒకడు అపకారం చేసాడు. దానికి ప్రతీకారం తీర్చుకోలేదు. ఈ జన్మలో ప్రతీకారం తీర్చుకోవడానికి అపకారం చేసినవాడికి పుత్రునిగా జన్మిస్తాడు.
- పూర్వ జన్మలో తాను అనుభవించిన సేవ - సుఖములకు బదులు తీర్చడానికి పుత్రునిగా జన్మించి తల్లిదండ్రులకు సేవ చేస్తాడు.
- పూర్వ జన్మలో తాను ఏ వ్యక్తి నుండి ఉపకారం పొందుతాడో, ఆ ఉపకారానికి బదులుగా ఉపకారం చేయుటకు పుత్రునిగా జన్మిస్తాడు.
- ఏమీ ఆపేక్షించనివాడు కూడా పుత్రునిగా జన్మించి, తన విధులను తీరుస్తాడు. ఇలా పుత్రులుగా జన్మించినవారు కర్మానుసారముగా తమ పనులు పూర్తికాగానే మరణిస్తారు, లేదా దీర్ఘకాలం జీవించి ఉపకారం చేయడమో, ప్రతీకారం తీర్చుకోవడమో చేస్తారు. కేవలం పుత్రులే కాదు, భార్య - భర్త - సోదరుడు - పనిమనిషి - ఆవు - కుక్క మొదలైన పశువులు కూడా కర్మరుణం తీర్చుకోవడానికి మనతో ఉంటారు. ఋణము తీరగానే వదిలి వెళ్ళడమో, పరలోకానికి చేరడమో జరుగుతుంది.