మహాలయ చవితి తిథి ప్రాముఖ్యత:
పితృ తర్పణ విధి:-
భాధ్రపద మాస కృష్ణపక్ష మందు మహాలయమును పితరులనుద్దేశించి చేస్తూ శక్తి కొలది వేద పారగులైన బ్రాహ్మణులకు అన్నంతో భోజనం పెట్టిన వారు దుర్గతిని పొందరు.
భాద్రపద కృష్ణపక్షమందు మహాలయ మందు తన శక్తికి తగినట్టు ఒక్కనికో, ఇద్దరికో, ముగ్గురికో బ్రాహ్మణులకు దారిద్ర్యం లేకుండ భోజనం పెట్టిన యెడల అతనికి దుర్గతి ఎప్పుడు ఉండదు. ఈతడు భాద్రపద మాసంలో పితరులను ఉపాసించనందు వలన ఈ బ్రాహ్మణుడు వేతాలుడైనాడు. పాపియైన నిన్ను పట్టుకున్నాడు. భాద్రపద మాసం కాలం మొదలుకొని వృశ్చికం వరకు తత్వదర్శులైన మునులు మహాలయమని చెప్పారు.
చవితి తిథి:
చతుర్థి యందు నరుడు భక్తితో మహాలయ శ్రాద్ధం చేయాలి. దాని వలన భగవాన్ పార్వతీసుతుడు ఐన హెరంబుడు సంతోషిస్తాడు. గజవక్త్రుని అనుగ్రహం వల్ల అతని విఘ్నాలు నశిస్తాయి. చతుర్థితి థి యందు మహాలయము చేయని నరునకు భగవాన్ విఘ్నేశుడు ఎప్పుడు విఘ్నం చేస్తూనే ఉంటాడు. చండకోలాహలమనే నరకంలో పడిపోతాడు కూడా. చతుర్థి తిథి యందు మహాలయము చేసిన నరుని పితరులు నలుబది సహస్రములు ఆనందంతో ఉండి శ్రాద్ధ కర్తకు నిరంతరంగా బహుపుత్రులనిస్తారు.