గరుడ కవచం ఈ మంత్రాన్ని మూడు రోజుల్లో 108 సార్లు పఠిస్తారో వారికి గరుడ పురాణం ప్రకారం పాము మంత్రం గరుడ ఉపాసన చేసేందుకు అధికారం వస్తుంది.
తార్ క్ష్యో మే పురతః పాతు గరుడః పాతు ప్రుష్టతః!
సోమః పాతు చమే వామం వైనతేయస్తు దక్షిణం!!
శిఖాయాం గరుడః పాతు నిటలం త్వహి సంధరః !
నాసికాగ్రం విభుః పాతు నయనే వినతాసుతః!!
తేజిష్ఠః శ్రోతీయోః పాతు ముఖం సంతాప మొచనః!
ఓష్ఠయోః పాతు నాగారిః పాతు తాలూ ప్రజాకరః!!
జిహ్వాంఖగేశ్వరః పాతు దంతాన్పాతు అరుణానుజః!
సీరుకశ్చి ఋకంపాతు చాంసయోః క్రుతవిక్రమః!!
మహారిహ గలంపాతు చాంసయో క్రుతవిక్రమః!
కరౌపాతుచ రక్తాక్షః కరాగ్రేతు మహాబలః!!
అంగుష్ఠౌచ హరిః పాతు తర్జన్యౌ హరివాహనః!
మధ్యమే సుముఖః పాతు చానామకే త్రిలోచనః!!
కనిష్ఠికే మహోత్సాహః స్వాత్మాంగః పాతుదోఃస్తనం !
కరప్రుష్ఠం కలాతీతో నఖాన్యమ్రుత సంఘరః !!
హ్రుదయం పాతు సర్వజ్ఞః కక్షే పక్షి విరాట్ తధా!
ఉరః స్థలం కలాధారః పాతుమే జఠరపరం !!
పరాత్పరః కటిం పాతు పాతునాభిం హరిప్రియః!
గుహ్వాంపాతు మనోవేగః జఘనం ఖగపద్మజః!!
జితేంద్రియో గుదంపాతు మేఢ్రం సంతానవర్దనః!
ఊరూపశుపతిః పాతు జానునీ భక్తవత్సలః!!
జంఘేపాతు జానునీ భక్తవత్సలః!
గుల్ఫౌ నీలశిరః పాతు పాద ప్రుష్టం మురారిధ్రన్ !!
ధీరః పాదతలం పాతు చాంగుళీ పరమం త్రక్రత్ !
రోమకూపానిమే పాతు మంత్రబంధ విమోచకః!!
స్వాహా కారః త్వచంపాతు రుధిరం వేదసారగః!
సాక్షికః పాతుమే మాంసం మేదాంసి పాతు యజ్ఞభుక్ !!
సామగః పాతు మేఛాస్థి శుక్రంతు హవివర్ధనః!
శోభనః పాతు మే మజ్జాం బుద్ధిం భక్తవరప్రదః
మూలాధారం ఖగంపాతు స్వాధిష్ఠాన మధాత్మవిత్!
మణిపూరక మత్యుగ్రః కలధీ పాత్వ నాహతం!!
విశుద్ధి మపరః పాతు చాజ్జ్నామా ఖండలప్రియః !ధ్రుత తార్ క్ష్యో మహా భీమో బ్రహ్మ రంధ్రం సమాభమే !!
ఐంద్రం ఫణి భుజః పాతు నైరుతం సురవైరిజిత్!
యామ్యం లఘగతిః పాతు నైరుతం సురవైరిజిత్!!
పశ్చిమం పాతు లోకౌశో ధౌతోరుః పాతు మారుతం!
గులి కాశీతి కౌబేరం పాతు చైశాన్య మౌజసః!!
ఊర్ధ్వం పాతు సదానంద గీత న్రుత్య ప్రయస్తధా !
గరుడః పాతు పాతాళం గరలాశీ తమం తధా !!
ధన ధాన్యాధికం పాతు తార్ క్ష్యో రాక్షస వైరిధ్రుక్!
భీషణః కన్యకాః పాతు భార్యామగ్నికర్మ క్రతూత్తమః!!
త్వరితః పాతుచాత్మానం ధర్మకర్మ క్రతూత్తమః పుత్రానాయుష్కరః పాతు వంశం రిపునిషూదనః !
సంగ్రామే విజయః పాతే మమాగ్రం శత్రుమర్ధనః!
సిద్ధింపాతు మహాదేవో భగవాన్ భుజగాశనః!!
సతతం పాతు మాం శ్రేష్ఠం స్వస్తిదః సాధకాత్మవాన్!
జాగ్రత్ స్వప్న సుషుప్తౌచ కుంకుమారుణ వక్షసః !!
సర్వసంపత్ ప్రదః పాతు స్తుతి మంత్రస్య సిద్ధిషు!
ఇదంతు తార్ క్ష్యో కవచం పురుషార్ద ప్రదంపరం!!
స్వస్తిదం పుత్రదం సర్వరక్షా కర మనుత్తమం !
యుద్ధే వహ్నిభయే చైవ రాజచోర సమాగమే!!
మహాభూతారి సంఘర్షే విజపేత్ కవచం శివే!
స్మరణా దేవనశ్యంతి ప్రచండానల తూలవత్
ఈ కవచం పఠించుట వలన సకల అరిష్టములు తొలగి ఇష్టసిద్ధి కలుగుతుంది.
మూడు రోజుల లో నూట ఎనిమిది సార్లు పఠిస్తే దైవ మంత్రాలు సాధనం చేసే అధికారం లభిస్తుంది.
హర హర మహాదేవ శంభో శంకర
శివ సంకల్పమస్తు శుభమస్తు.