తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలోని నరేంద్రపురం గ్రామానికి చెందిన వేంకటేశ్వరస్వామి భక్తులు సైకిల్ యాత్ర చేపట్టారు. 28 ఏళ్లుగా ఏటా క్రమం తప్పకుండా వారందరూ వేంకటేశ్వరస్వామి మాల ధరించి, దీక్ష పూర్తిచేసుకుని సైకిల్‌పై తిరుమలకు వెళ్లి స్వామి వారిని దర్శించుకోవడం పరిపాటిగా మారింది.
గ్రామానికి చెందిన ప్రగడ అంకాలు తన స్నేహితులతో కలిసి చేపడుతోన్న ఈ సైకిల్ యాత్ర 28 వసంతాలు పూర్తి చేసుకుంది. అంతేకాకుండా నరేంద్రపురంతో పాటుగా సీతానగరం, వెలుగుబంద, చెముడులంక గ్రామాల నుంచి 400 నుంచి 500 మంది భక్తులు ఏటా సెప్టెంబరులో సైకిల్ యాత్ర చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది. వారం రోజుల పాటు సాగే యాత్ర తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనంతో దీక్ష ముగుస్తుందని భక్తులు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని స్థానికులు వనువులమ్మ ఆలయం వద్ద ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొని సైకిల్ యాత్ర సజావుగా సాగాలని ఆకాంక్షించారు.
share on Facebook