Telugu sonta vākyālu |
తెలుగు సొంత వాక్యాలు
ముగ్ధులు = సంతోషం పొందినవారు మా పాఠశాలలో సుమతీ శతకంలోని వంద పద్యాలనూ ఆపకుండా అప్పజెప్పిన విజయ ప్రతిభకు అందరూ ముగ్ధులు అయ్యారు. |
పునీతం = పవిత్రం రాముడు, కృష్ణుడు, బుద్ధుడు మొదలైన మహనీయుల పాదాల స్పర్శతో మన నేల పునీతమైంది. |
వైభవోపేతం = గొప్పదనంతో కూడుకొన్నది. మా ఊళ్ళో ప్రతి సంవత్సరం వైభవోపేతంగా తిరునాళ్ళు జరుగుతాయి. |
జగజ్జేగీయమానం = లోకంలో మిక్కిలి కొనియాడబడినది. జగజ్జేగీయమానమైన మన సంస్కృతిని గురించి ప్రతి భారతీయుడూ విధిగా తెలుసుకోవాలి. |
దగ్గర = చేరువ ఉపాధ్యాయుని చేరువలో ఉంటే విజ్ఞానం పెరుగుతుంది. |
దశదిశలు: గాంధీ గారి కీర్తి ప్రపంచంలో దశదిశలా వ్యాపించింది |
కాళ్ళు కడుగు: అత్తమామలు అల్లుడి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు |
అభ్యాగతుడు: అభ్యాగతుడు స్వయంగా విష్ణుమూర్తి వంటివాడని పెద్దలంటారు. |
సిరి మూటకట్టుకొని పోవడం: ఏ వ్యక్తికీ సిరి మూట కట్టుకొని పోవడం శక్యం కాదు. బ్రతికుండగానే దానధర్మాలు చేసుకోవాలి. |
సత్యహీనుడు: సత్యహీనునిగా బ్రతకడం కంటే మరణము మేలు |
మానధనులు : మానధనులే నిజమైన కోటీశ్వరులు |
చేతులొగ్గు: ఎవరి దగ్గరా చేతులొగ్గి యాచించడం మంచిపని కాదు. |
కురచగుట : దర్జీ కుట్టిన చొక్కా, మా పిల్లవాడికి కొద్దిగా కురచయ్యింది. |
పలికి లేదనుట : మా వంశ చరిత్రలో పలికిలేదనడం ఎప్పుడూ లేదు. |
నిరాఘంటంగా - అడ్డులేకుండా వాక్యము: రాజకీయ నాయకులు నిరాఘంటంగా మాట్లాడతారు. |
చిలుక పలుకులు - సొంతంగా ఆలోచించకుండా మాట్లాడే మాటలు వాక్యం: చిన్నపిల్లల మాటలు చిలుకపలుకులుగా వినిపిస్తారు. |
అధిక్షేపించుట - ఆక్షేపించు వాక్యం: విద్యార్థులు గురువుల మాటని అధిక్షేపించాలి. |
భగ్నోత్సాహులు - ఉత్సాహం కోల్పోయినవారు వాక్యం: నా మిత్రుడు పరీక్షలలో తక్కువ మార్కులు రావడం వలన భగ్నోత్సాహులుగా ఉన్నాడు. |
బ్రతుకు తెరువు: చాలా మంది బ్రతుకుతెరువుకై పట్టణానికి వలస వస్తారు. |
ఎదురొడ్డు - స్వాతంత్ర సమరయోధులు బ్రిటిష్ వారితో ఎదురొడ్డి పోరాడారు. |
కుదువ పెట్టు - సోమయ్య అప్పు తీర్చుటకై తన ఆస్తిని కుదువపెట్టారు. |
తలదాచుకొను - పూర్వం కాలినడక ప్రయాణికులకు తలదాచుకొనేటందుకు సత్రాలు నిర్మించేవారు. |
వారాలు చేసుకొనటం - పూర్వం డబ్బు లేని పిల్లలు వారాలు చేసుకొని చదువుకొనేవారు. |
వెనుకాడు - పిల్లలు మంచి పనులు చేయడానికి వెనుకాడవద్దు. |
జవదాటు - పిల్లలు పెద్దల మాటలను జవదాట వద్దు. |
సమయ స్పూర్తి - ఆపదలు కలిగినప్పుడు భయపకుండా సమయ స్పూర్తి తో వాటిని జయించాలి. |
తుడిచి పెట్టుకొని పోవు - అగ్ని ప్రమాదం సంభవించి నా స్నేహితుని ఆస్తి మొత్తం తుడిచి పెట్టుకొని పోయింది. |
కన్నుమూయు - ధర్మయ్య తన ఆస్తిని పిల్లలకు రాసియిచ్చి కన్ను మూశారు. |