సంకల్పములు
మృగ సంకల్పము :
ఆహార నిద్ర భయ మైధున విషయ చింతనలు మాత్రమే ఉండి ధర్మాచరణ లేక, ఇతరులకు కీడుచేయు పశుతుల్యులైన వారి సంకల్పము మృగ సంకల్పమనబడును.
మనుష్య సంకల్పము :
తన సామాన్య ధర్మమును పోషించుచు, ఇతరులను చెరపక యుండువారి సంకల్పము మనుష్య సంకల్పము అనబడును.
దేవ సంకల్పము :
దైవిక సంబంధమగు కార్యములను చేయవలెననెడి సంకల్పము. కొంత అంతఃకరణ శుద్ధి ఉండుట దేవ సంకల్పమనబడును.
ఋషి సంకల్పము :
విషయ వాసనాతీతమైన స్థితిలో కలిగే సంకల్పము, జీవ కారుణ్యము, లోక కళ్యాణము, శాంతి కలిగించే సంకల్పము ఋషి సంకల్పము.
ఈశ్వర సంకల్పము:
త్రిమూర్తుల సృష్టి, స్థితి లయములలో, లోకపాలన, నియతి పాలన సంబంధించిన విశుద్ధ సంకల్పము ఈశ్వర సంకల్ప మనబడును.
నిస్సంకల్పము :
దృశ్యములేవీ తోచకుండుట, ఆత్మాకారమై యుండుట, కేవల జ్ఞేయ స్వరూపమైయుండుట నిస్సంకల్పమనబడును. నిస్సంకల్పుల ఆజ్ఞలు దేవతలకు, త్రిమూర్తులకు శిరోధార్యము
సర్వం శ్రీపరమేశ్వరార్పణమస్తు