- మహా స్మశానం - వారణాసి
- మనో స్మశానం - అరుణాచలం
అత్యంత తేలికగా మోక్షం లభించే మార్గం చూపండి... మహా ప్రభో...! అని ఋషులు మహర్షులు బ్రహ్మను, విష్ణువు, శివుని కోరినప్పుడు... వారు చూపిన మార్గాలు కడు కష్టతరంగా భావించి, ఎంతో మంది ఋషులు తిరిగి తిరిగి జన్మిస్తూనే వున్నారు... కాశీలో మరణం కన్నా... అర్హతతో కూడిన అరుణాచల యాత్ర మోక్షానికి సులభ మార్గమని తెలిసిన వేల మంది ఇప్పుడు అరుణాచలంలో వాన ప్రస్థాశ్రమాన్ని గడిపారని... స్థాయిని, వేల కోట్లా ఆస్తులను వదిలి, ఇప్పటికీ అక్కడే గడుపుతూ వున్నారని, మనలో ఎంత మందికి తెలుసు?
- అర్హత గల అరుణాచలేశ్వర యాత్ర చెయ్యగలిగితే, అది తప్పకుండ శివుని అనుగ్రహమే !
- శివుని అనుమతి లేనిదే ప్రవేశం దొరకని క్షేత్రం "అరుణాచలం"- ఒక్కసారి అరుణాచలంలో ప్రవేశించిన తర్వాత...
- మౌనం పాటించండి (మాట్లాడితే మనసు శివుని మీద ఉండదు)
- శివనామ స్మరణ చేస్తూనే వుండండి (లేదంటే మన నాలుకకు హద్దు ఉండదు)
- వీలైనంత వరకు మితాహారం పాటించండి (లేదంటే స్పృహ శివుని మీద ఉండదు)
- సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్, సైలెంట్ మోడ్ లో పెట్టేయండి (లేదంటే మనం మనతోనే ఉండలేము... అక్కడ శివునితో ఉండాలి)
- మన దర్పం చూపకూడదు (అక్కడ శివుడే సుప్రీమ్... మనం జీరో)
- దంపతులైనా సరే దాంపత్య జీవితం అక్కడ గడపకూడదు (కోరికలు దగ్ధం చేసే అరుణాచలంలో కోరికలను తీర్చుకోకూడదు)
- వీలైతే అన్నదానం చెయ్యండి, అది చేసే వారికి ఏమైనా ధనం, దానం చేయండి యధా శక్తి మీరు ఇవ్వగలిగితేనే. ఎవ్వరిని దూషించకండి (అక్కడ శివ పార్వతులు సిద్ధుల రూపంలో, సాధారణ రూపంలో మన మధ్యలోనే వుంటారు)
తప్పదు కాబట్టి.. మీ హోటల్ రూమ్లో తప్ప... అరుణాచల క్షేత్రంలో ఎక్కడ పడితే అక్కడ ఉమ్ములు, మల మూత్ర విసర్జనలు, ప్లాస్టిక్ వాడకాలు చెయ్యకండి.
అరుణాచలం సాక్షాత్తూ శివుడు ప్రత్యక్షంగా సంచరించే గొప్ప క్షేత్రం. సాధారణ పుణ్య క్షేత్రంలా కేవలం దర్శనం నిమిత్తం అరుణాచలం రావద్దు. ఇది పరమ పావన ఆవిర్భావ అగ్ని లింగ క్షేత్రం. మనసా వాచా కర్మణా శివ స్పృహతో చేసే యాత్ర... అరుణాచల యాత్ర.
- ఒక్కసారి అర్హతతో కూడిన అరుణాచల దర్శనం చెయ్యగలిగితే ఇక మరొక జన్మ ఉండదు!
- మనిషి జీవితాన్ని రెండు భాగాలుగా విభజించదగిన సమయం- అరుణాచల ప్రవేశం.
- ఇందులో శివ స్పృహతో, నియమనిష్టలతో గిరి ప్రదక్షిణ చెయ్యడం అనేది, కేవలం పుణ్య కార్యం మాత్రమే కాదు, జన్మకు సరిపడా గుర్తుంచుకోదగిన మహా ఘట్టం అవుతుంది.
- గిరి ప్రదక్షిణతో మాత్రమే అరుణాచల యాత్ర సంపూర్ణం అవుతుందని మర్చిపోకూడదు.
అరుణాచలంలో ఉన్నంత సేపు మరియు గిరి ప్రదక్షిణలో అనుక్షణం అందరూ గిరి వైపు చూస్తూ మౌనంగా లేదా అరుణాచలశివ అంటూ శివనామ స్మరణ చేస్తూనే ఉండాలి. అది కేవలం కొండ కాదు. ఆ కొండ కొండ మొత్తం యోగ నిద్రలో ఉన్న శ్రీదక్షిణామూర్తి. ఆ కొండ స్వరూపంలో నంది, గౌరీ, గణేశా, కుమారస్వామి వార్లతో సజీవంగా కూర్చుని ఉన్న ఆ మహా శివుడే ఆ అరుణగిరీషుడు.
అరుణగిరి వాడుకలో తిరువణ్ణామలై అయినది - తిరు అరుణమలై- తిరువణ్ణామలైగా మారింది.
గిరి ప్రదక్షిణ చేస్తున్న చాలా మందిని గమనించండి !
వారి వారి వ్యాపార కుటుంబ మరియు ఇతర అనుభవాల గురించి మాట్లడుకుంటూ, నవ్వుకుంటూ, ఏవి పడితే అవి తింటూ, ఒక విహార యాత్ర లాగా, నడుస్తున్న ఆ 14 కిలోమీటర్లు ఎలా టైం పాస్ చెయ్యాలి అనుకుంటూ, ఎన్ని లింగాలు పూర్తి అయ్యాయి, ఇంకా ఎంత దూరం వుంది, మరో గంటలో అయిపోతే హాయిగా పుణ్యంతో పాటు రూమ్ కి వెళ్లి, వెంటనే తిరుగు ప్రయాణం చేసి, రేపు వ్యాపారంలో లేదా వుద్యోగంలో ఏమేం పనులు చేసుకోవాలి అనుకుంటూ... ఇదే స్పృహతో గిరి ప్రదక్షిణ చేస్తున్న వాళ్ళను ఎక్కువమందిలో గమనించవచ్చు.
అతికొద్దీ మంది మాత్రమే మౌనంగా, శివ నామ స్మరణతో తాదత్మ్యం చెందుతూ, ప్రదక్షిణ చేస్తుండడం సులభంగా గమనించవచ్చు.
తరువాతి యాత్రలో నైనా గిరి ప్రదక్షిణ చేసే విధానాన్ని మార్చుకుంటే ఆ యాత్ర ఫలం దక్కుతుందని మరవద్దు.
అరుణాచలంలో దక్షిణామూర్తిగా... స్థూల రూపంలో కొలువైయున్న ఆ మహా శివుడు ప్రత్యక్షమైతే మనం ఆయన్ని ఏమి కోరుతారో ఆయనకి తెలియదు గాని... ఆయన మాత్రం ఒక్కటే కోరుతాడు. భక్తి పేరు చెప్పి నా భక్తుల్ని ఇబ్బంది పెట్టినా, మోసం చేసినా, శివుని రుద్ర రూపం మీరు చూస్తారు అని... అంటే నేను ఎంత కారుణ్య మూర్తినో... అంతటి కఠినాత్ముడను... శిక్షల విషయంలో అని.. కనుక శివ దర్శనం కావాలి అంటే.. తొలుత శివ సమ్మతం సాధించండి.. సర్వం శివోహం!
#అరుణాచలశివ🙏
#సర్వేజనఃసుఖినోభవంతు