మథుర శ్రీకష్ణ జన్మభూమి వివాదంలో అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. షాహీ ఈద్గా మసీదు భూమి హిందువులదే అంటూ దాఖలైన 18 పిటిషన్లపై విచారణ కొనసాగుతుందని అలహాబాద్ హైకోర్టు తీర్పును వెల్లడించింది. హిందూ సంస్థల పిటిషన్లను కొట్టేయాలన్న ముస్లిం సంస్థల పిటిషన్‌ను కోర్టు తీర్పును వెల్లడించింది. షాహీ ఈద్గా మసీదులో పూజలకు అనుమతించాలని హిందూ సంస్థలు పిటిషన్ దాఖలు చేశాయి.
మసీదు లోని రెండున్నర ఎకరాల భూమి శ్రీకృష్ణ జన్మభూమి ఆలయానికే చెందుతుందని వాదించాయి. మసీదు కమిటీ దగ్గర భూమికి సంబంధించి ఎలాంటి రికార్డులు లేవని కూడా పిటిషన్లో వెల్లడించారు. జూన్ 6న విచారణ అనంతరం, ముస్లిం పక్షం దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ మయాంక్ కుమార్ జైన్ నిర్ణయాన్ని రిజర్వ్ చేశారు.
శ్రీకృష్ణ జన్మభూమి కేసులో దేవస్థానం తరఫు న్యాయవాది సౌరభ్ తివారీ భారీ విజయం సాధించిందన్నారు. అలహాబాద్ హైకోర్టులోని జస్టిస్ మయాంక్ కుమార్ జైన్‌తో కూడిన సింగిల్ బెంచ్ CPC ఆర్డర్ 7, రూల్-11 ప్రకారం షాహి ఈద్గా మసీదు ట్రస్ట్ దరఖాస్తును తిరస్కరించింది. ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేయనున్నట్టు మసీదు తరఫు నుంచి సంకేతాలు వెలువడ్డాయి.
Courtesy : tv9