మట్టి గణపతి |
వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ మట్టి గణపతినే పూజించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు అనంతపురం ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ జి.రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.
కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వినాయక చవితి విశిష్టతను కాపాడేందుకు సమష్టిగా కృషి చేయాలన్నారు. పర్యావరణానికి హాని కలిగించని సహజ రంగులతో చేసిన మట్టి ప్రతిమలతో పండుగ జరుపుకునేలా ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలన్నారు. ఈ అంశంపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. మట్టి ప్రతిమలు అందించే వారిని ప్రోత్సహించాలని సూచించారు.