Alampuram Jogulamba
అలంపురం జోగులాంబ
పూర్వము దక్షప్రజాపతి నివసించిన ప్రదేశముగా దక్షారామము ప్రసిద్ధిచెందినది. ఒకసారి దక్షుడు ఒక యజ్ఞం చేయ తలపెట్టినాడు. ఆ యజ్ఞానికి అందరినీ ఆహ్వానించినాడు కానీ, కారణాంతరాలవల్ల, తన అల్లుడైన శివుణ్ణి ఆహ్వానించలేదు. కారణం అంతకు ముందెప్పుడో ఈయనగారిని చూసి ఆయన పలకరించలేదనీ, అభివాదం చేయలేదని కోపం వచ్చి. నిరీశ్వర యజ్ఞం చేయాలని సంకల్పించినాడు.
ఈ యజ్ఞం గురించి పార్వతీ దేవికి తెలిసి. పుట్టింట్లో యజ్ఞం జరుగుతోంది, ఆసంబరం చూడ ఉత్సుకత ఎంతగానో తనకున్నదని, వెళ్తానని పరమశివుని అడుగుతుంది. కానీ శివుడు పిలవని పేరంటానికి వెళ్ళవద్దని చెబుతాడు. మొత్తానికి పరమేశ్వరుడిని ఒప్పించి, పుట్టింట్లో జరిగే యజ్ఞానికి వెళ్ళింది. శివుడ సతీదేవితో, అక్కడ అవమానము జరిగితే తిరిగీ కైలాసము రావద్దని అంక్ష విధించుతాడు. ఆయనకు భూత భావిష్యద్వర్తమానములు విదితములే కదా! అక్కడ సతీదేవికి అన్నివిధములా శృంగభంగము జరుగుతుంది. దానితో సతీదేవికి కోపం వచ్చింది. భర్త మాట వినకుండా వచ్చినదానికి పశ్చాత్తాప పడింది. ఇటు పుట్టింట్లోనూ వుండలేక పోయింది, అటు శివుడి దగ్గరకు వెళ్ళలేక పోయింది. అవమానం భరించలేక జగన్మాత యజ్నగుండము లోనికి దూకింది. శివుడు విషయమును గ్రహించి వీరభద్ర కాలికాడులను పరమత గణములతో కూడా పంపి యజ్ఞమును ద్వంసముజేసి విలయతాండవము జరిపినారు. శివుడు అప్పుడు అచటికి వచ్చి సతీదేవి అగ్నికి ఆహుతి కాకుండానే ఆమె మృతదేహమును భుజముపై వేసుకొని లోక సంచారమునకు సమకట్టినాడు. తారకాసుర సంహారమునకు కుమారోద్భవము జరుగవలసియున్ననందున. విష్ణువు యోచించి తన చక్రాయుధముతో సతీదేవి శవమును ముక్కలు ముక్కలు చేసినాడు. ఆ శరీర భాగములు 18 ముక్కలయి 18 చోట్ల పడినాయి. అవే అష్టాదశ శక్తి పీఠాలు. వీటిని జగద్గురువు శంకరాచార్యుల వారు పున ప్రతిష్టించి అన్ని చోట్లా శ్రీచక్రాలను స్ధాపించినారు. ఆ తరువాత సతీదేవి పార్వతియై హిమవంతుని కూతురిగా జన్మించి కుమారసంభవమునకు కారణమై తారక సంహారమునకు దొహదపడినది.
అష్టాదశ శక్తిపీఠాలు ఏవి అనే విషయానికి ప్రామాణికంగా చెప్పబడే ప్రార్థనా శ్లోకంము ఈ క్రింది విధముగా వున్నవి.
1. లంకాయాం శంకరీదేవీ, కామాక్షీ కాంచికాపురే |
ప్రద్యుమ్నే శృంగళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే ||
2. అలంపురే జోగులాంబా, శ్రీశేలే భ్రమరాంబికా |
కొల్హాపురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా ||
3. ఉజ్జయిన్యాం మహాకాళీ, పీఠిక్యాం పురుహూతికా |
ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికే ||
4. హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీ |
జ్వాలాయాం వైష్ణవీదేవీ, గయా మాంగళ్యగౌరికా ||
5. వారాణస్యాం విశాలాక్షీ, కాష్మీరేషు సరస్వతీ |
అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభమ్ ||
6. సాయంకాలే పఠేన్నిత్యం, సర్వశతృవినాశనమ్ |
సర్వరోగహరం దివ్యం సర్వ సంపత్కరం శుభమ్ ||
ఈ పద్దెనిమిది శక్తి పీరములలో ఐదవది జోగులాంబ తల్లిది. ఆ తల్లిని ఈ క్రింది విధముగా ప్రార్థించుతారు.
లంబస్తనీం వికృతాక్షీం ఘోరరూపం మహాబలాం |
ప్రేతాసన సమారూఢాం జోగులామ్బాం నమామ్యహం ||
అమ్మది ఇక్కడ భీకరాకారము. జారిన కుచములు, వికృత ద్రుష్టికలిగిన కనుగవ, ఘోరంకగు రూపము, మహా బలిష్టమగు శరీరము, పైగా ఈ తల్లి ప్రేతాసనముపై కూర్చొని ఉంటుంది. ఈ విక్రుతులను వైపరీత్యాలను తానూ గ్రహించి భక్తులను కాఆపాడు ఆ తల్లికి సాష్టాంగ నమస్కారము.
Alampuram Jogulamba |
దేవాలయ చరిత్ర:
ఈ దేవాలయం ఏడవ శతాబ్దంలో నిర్మించబడి, 1390లో బహమనీ సుల్తానుల ఆగడములచే నేలమట్టము చేయబడినది. విజయనగర చక్రవర్తి రెండవ హరిహర రాయలు, బహమనీ సుల్తాన్ సైన్యంతో పోరాడటానికి తన సైన్యాన్ని పంపి, తదుపరి దాడులను అరికట్టి దేవాలయ సముదాయాన్ని పటిష్ఠపరిచినాడన్నది చరిత్రకారులు చెబుతున్నమాట. ఈ దాడిలో దేవాలయం దెబ్బతినడంతో జోగులాంబ అమ్మవారు, ఆమె శక్తి రూపాలైన చండీ, ముండీలను సమీపంలోని ప్రక్కనున్న బాలబ్రహ్మ దేవాలయానికి పూజారులు తరలించి, దాచిపెట్టినారు. అప్పటినుండి 2005 వరకు అమ్మవారు ఇదే దేవాలయంలో కొలువై పూజలు అందుకున్నారు. 2005లో జోగులాంబ దేవాలయాన్ని పునర్నిర్మించిన తరువాత మళ్ళీ ఆ విగ్రహాన్ని అక్కడ పునఃప్రతిష్ఠించుట జరిగినది.
అలంపురం సమీపంలో కృష్ణ, తుంగభద్ర నదులు సంగమించడం వల్ల ఈ ప్రాంతాన్ని దక్షిణకాశీగా అభివర్ణిస్తూ ఉంటారు. అలనాటి ఆంధ్ర రాష్ట్ర రాజధాని కర్నూలుకు ఈ పుణ్యక్షేత్రము 27 కిలో మీటర్ల దూరంలో ఉంది. మహబూబ్‌నగర్‌కు 90 కిలోమీటర్ల దూరంలోనూ, జిల్లా కేంద్రమయిన గద్వాలుకు 60 కి.మీ. దూరములోనూ, హైదరాబాద్‌కు 200 కిలో మీటర్ల దూరంలోనూ నెలకొని ఉన్నdiది. అలాగే, ఈ క్షేత్రంలో నవ బ్రహ్మలు కొలువై ఉన్నారు. ఈ దేవాలయ సముదాయమును కట్టించిన ఘనత బాదామి చాళుక్యులది. నాటి ఈ క్షేత్ర వైభవము వర్ణనాతీతమని చరిత్రకారుల మాట. కన్నడ, ఆంధ్రప్రదేశాలలో అనేక నిర్మాణాలు వీరి ఔదార్యము మరియు భక్తియే! వీరు బీజాపూర్ మొదలైన కన్నడ ప్రాంతాలలోనేకాక ఆంధ్రప్రదేశ్‌లోని అలంపురం, సంగమేశ్వరం మొదలైన చోట్ల దేవాలయాలు నిర్మించినారు. అలంపూర్ తుంగభద్ర, కృష్ణా నదుల సంగమ ప్రదేశం ఒడ్డున కలదు. మహబూబ్ నగర్ జిల్లాకు దక్షిణ దిక్కున ఈ చారిత్రక క్షేత్రము ఉన్నది.
జోగులాంబ |
అలంపురం సమీపంలో కృష్ణ, తుంగభద్ర నదులు సంగమించడం వల్ల ఈ ప్రాంతాన్ని దక్షిణకాశీగా అభివర్ణిస్తూ ఉంటారు. అలాగే, ఈ క్షేత్రంలో నవ బ్రహ్మలు కొలువై ఉన్నారు. బాదామి చాళుక్యుల కాలంలో ఒక వెలుగు వెలిగిన ప్రదేశం అలంపూర్. బాదామి చాళుక్యులు... కన్నడ, ఆంధ్రప్రదేశ్‌లలో అనేక నిర్మాణాలు చేపట్టినారు.బీజాపూర్ జిల్లా మొదలైన కన్నడ ప్రాంతాలలోనేకాక ఆంధ్రప్రదేశ్‌లోని అలంపురం, సంగమేశ్వరం మొదలైన చోట్ల దేవాలయాలు నిర్మించారు. అలంపూర్ తుంగభద్ర, కృష్ణా నదుల సంగమ ప్రదేశం ఒడ్డున కలదు. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాకు దక్షిణ దిక్కున ఈ చారిత్రక పట్టణం ఉన్నది. జాతీయ రహదారికి చేరువలో ఉన్న అలంపూర్ కు బస్సు, రైలు మార్గాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు. అలంపూర్ పట్టణం కర్నూల్ నగరానికి 27 కి. మీ ల దూరంలో, మహబూబ్ నగర్ పట్టణానికి 90 కి. మీ ల దూరంలో, గద్వాల కు 61 కి. మీ ల దూరంలో మరియు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు 200 కి. మీ ల దూరంలో కలదు. అలంపూర్ అష్టాదశ శక్తి పీఠాలలో 5 దవది మరియు ఈ క్షేత్రంలో నవ బ్రహ్మ ఆలయాలు ఉన్నాయి. బాదామి చాళుక్యలు 2000 సంవత్సరాల క్రితం ఈ తొమ్మిది ఆలయాలను నిర్మించి శివునికి అంకితం చేసినారు. జోగులాంబ, బాల బ్రహ్మశ్వర స్వామి ఆలయాలు చరిత్ర ప్రసిద్ధి గాంచినవి. అలంపూర క్షేత్రము ఉత్తర వాహిని తుంగభద్రతీరంలో నెలవై... దక్షిణ కాశీ గా పేరుగాంచిన ఈ క్షేత్రము. ఈ క్షేత్ర విశేషాల గూర్చి కాస్త తెలుసుకొందాము.... ప్రస్తుతం అలంపురముగా పిలవబడుతున్న ఈ గ్రామము పూర్వ కాలంలో హలంపుర, హతంపుర, అలంపుర అని తెలియవస్తూ ఉన్నది. స్థల పురాణాలలో హేమలాపురమని ఈ గ్రామం వ్యవహరించబడిం దని శాసనాలను బట్టి తెలుస్తోంది. ఉర్దు రికార్డులలో అల్పూర్, అలంపూర్ అనే పేర్లతో వ్రాయబడి ఉన్నది. భారత ప్రభుత్వం అర్ష శాఖ వారు సేకరించిన డాక్టర్ ె.ఏ నీలకంఠశాస్ర్తి ప్రకటించిన గురజాల బ్రాహ్మీలిపి లోని శాసనములో అలంపురము ప్రస్తావన ఉంది. నడుకశ్రీ(అర్థము తెలియలేదు) అనే వ్యక్తి తన ఆయుష్షు పెరుగుట కోసం భగవంతుడైన అలంపుర బాలబ్రహ్మేశ్వర స్వామికి కొంత భూమిని ధారాదత్తము చేసినాడట.

నవబ్రహ్మ ఆలయాలను బాదామి చాళుక్యులు నిర్మించినారు. వీరు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో మిక్కుటముగా ఆలయాలను కట్టించినారు. తారక బ్రహ్మ, స్వర్గ బ్రహ్మ, పద్మ బ్రహ్మ, బాల బ్రహ్మ, గరుడ బ్రహ్మ, కుమార బ్రహ్మ, అర్క బ్రహ్మ, వీర బ్రహ్మ మరియు విశ్వ బ్రహ్మ అనే తొమ్మిది బ్రహ్మ ఆలయాలు నవ బ్రహ్మ ఆలయాలుగా ప్రసిద్ధి చెందినాయి. బాలబ్రహ్మశ్వర దేవాలయము ఆలయాలన్నింటిలో పెద్దది. తారక బ్రహ్మ దేవాలయం శిధిలమై ఉంటుంది మరియు గర్భగుడిలో ఎటువంటి విగ్రహము ఉండదు. స్వర్గ బ్రహ్మ దేవాలయం సుందరమైనది మరియు చాళుక్యుల శిల్పకళా సౌందర్యమునకు మచ్చుతునకగా నిలచింది. క్రీ.శ. 9 వ శతాబ్దానికి చెందిన సూర్యదేవాలయము జోగులాంబ ఆలయ ప్రాంగణంలో కలదు. ఇక్కడ విష్ణు మూర్తి కి చెందిన సుందరమైన విగ్రహాలు కలవు. అలాగే, శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించిన నరసింహ దేవాలయం కూడా ఉన్నది. కృష్ణా, తుంగభద్ర రెండు నదులకు పుష్కరాలు వచ్చినప్పుడు అలంపురము భక్తుల కోలాహలము తో కిటకిటలాడుతుంది.
అలంపురము ఎలా చేరుకోవాలి అన్న సందేహమునకు ఇక్కడ సమాధానము దొరుకుతుంది. విమాన మార్గం అలంపూర్ కు 200 కి. మీ ల దూరంలో హైదరాబాద్ విమానాశ్రయం కలదు. క్యాబ్ లేదా టాక్సీ లలో ప్రయాణించి అలంపూర్ చేరుకోవచ్చు. రైలు మార్గం అలంపూర్ లో జోగులాంబ హాల్ట్ (అలంపూర్ రోడ్డు) పేరుతో రైల్వే స్టేషన్ కలదు. బెంగళూరు - హైదరాబాద్ రైల్వే లైన్ లో ఈ స్టేషన్ కలదు. కర్నూలు, హైదరాబాద్, గద్వాల్ నుండి ప్యాసింజర్ రైళ్లు, కొన్ని ఎక్స్ ప్రెస్ రైళ్లు వస్తుంటాయి. బస్సు / రోడ్డు మార్గం జాతీయ రహదారి అలంపురము గుండా వెళుతుంది. హైదరాబాద్, కర్నూలు, గద్వాల్, మహబూబ్ నగర్, జడ్చర్ల మరియు సమీప పట్టణాల నుండి ప్రభుత్వ బస్సులు నడుస్తుంటాయి.
Alampuram Jogulamba |
సంగ్రహముగా అలమ్పురమును గూర్చిన సమాచారము పాఠకుల సౌఖర్యార్థము ఈ దిగువన ఇవ్వబడినది.
- అష్టాదశ శక్తి పీఠాల లోని ఒక శక్తి పీఠం...ఈ ప్రదేశంలో దేవి యొక్క పై దవడ పడిందట.
- ఈ క్షేత్రంలో అమ్మవారిని యోగులంబ అని, యోగాంబ అని చివరికి జోగులాంబ గా స్థిరపడిందని ప్రతీతి..
- బహమనీ సుల్తానుల దాడులలో (క్రీ. శ. 1480) పూర్వపు ఆలయం పూర్తిగా శిధిలమయిందట. కారణం ముష్కర తురుష్క మూకలు అమ్మవారి ఆ ఆలయమును పూర్తిగా నామ రూపాల్లేకుండా ధ్వంసం చేయుటయే!
- పూజారులు మాత్రం అమ్మ వారి విగ్రహాలను కాపాడ గలిగినారు. (చిత్రంలో దెబ్బతిన్న ఆలయకలశాన్ని చూపాను చూడండి)
- దేవి ఇక్కడ చండి ముండి (బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో) రూపంలో ఉంటుంది.
- దేశానికే పేరెన్నిక గల ఒక శక్తి పీఠం తిరిగి పునరుద్ధరణకు నోచుకోవడానికి పట్టిన సమయము 525 సంవత్సరములు.
- చంద్రబాబు నాయుడు గారి హయాంలో కొత్తగా కట్టిన గుడిలో అమ్మవారి పునః ప్రతిష్ఠ చేసినారు.
- తురుష్కులు కేవలం ధ్వంసం చేయుటతో ఆగక ధ్వంసము చేసిన ఆలయముయొక్క స్థలమున ఒక దర్గాను ఏర్పరచి నడుపుచున్నారు.
- గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు ముస్లిం మత పెద్దలందరినీ ఒప్పించి దర్గా ను ఒక చిన్న గదికి పరిమితం చేసినారు.
- ఈ క్షేత్రం తుంగభద్రా నది ఒడ్డున ఉంది. పూర్వం శ్రీశైలం ప్రాజెక్టు లో నీరు నిండితే ఈ ఆలయముపై నదీ ప్రవాహ ప్రభావం పడకుండా పెద్ద గోడ కత్తుట జరిగినది. .
ఇక్కడ అమ్మవారిది ఉగ్ర రూపము.
ఆ వేడిమిని తగ్గించుటకు దగ్గరగా ఒక తటాకాన్ని నిర్మించినారు.
ఇక్కడ బ్రహ్మ ప్రతిష్టించిన 9 ఆలయాలు నవబ్రహ్మ ఆలయాలుగా ప్రసిద్ధి.
అవి:
- తారక బ్రహ్మ ఆలయము
- స్వర్గ బ్రహ్మ ఆలయము
- పద్మ బ్రహ్మ ఆలయము
- బాల బ్రహ్మ ఆలయము
- విశ్వ బ్రహ్మ ఆలయము
- 6గరుడ బ్రహ్మ ఆలయము
- కుమార బ్రహ్మ ఆలయము
- ఆర్క బ్రహ్మ ఆలయము
- వీర బ్రహ్మ ఆలయము.
ధ్వంసము కాగా మిగిలిన పురాతన ఆలయలో చాల ఉపాలయాలు ఉన్నాయి. చాల విశాల ప్రాంగణము ను ఈ దేవాలయము కలిగియున్నది. ఈ ఆలయ శిల్పకళ అత్యద్భుతము. ద్వారలపై భాగంలో బ్రహ్మ లోకం, విష్ణులోకం, శివలోకం అనే మూడు శిల్పాలు పై కప్పు పై చెక్క బడినాయి.
ఇంకా ఇచట సూర్యనారాయణ స్వామి ఆలయము, నరసింహ స్వామి ఆలయము ఉన్నాయి. వీటిని శ్రీకృష్ణ దేవరాయలు కట్టించినాడు.
ఈ క్షేత్రం కర్నూల్ నుండి కేవలం 25 కి.మీ.దూరంలో, హైదరాబాదు నుండి 200 కి.మీ. దూరంలో ఉంది. కానీ ఇది తెలంగాణాలోని గద్వాల్ జిల్లా కు చెందుతుంది.
ఆచారాలు & పూజలు
- శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామికి అభిషేకం - సమయాలు: ఉదయం 7.30 నుండి 11.00 వరకు మరియు మధ్యాహ్నం 2.00 నుండి సాయంత్రం 4.00 వరకు
- అమ్మవారి సేవ-అంతరాలయ దర్శనం - సమయాలు: ఉదయం 7.30 నుండి సాయంత్రం 4.00 వరకు.
- శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామికి అష్టోత్తర అర్చన - సమయాలు: ఉదయం 7.30 నుండి 11.00 వరకు మరియు మధ్యాహ్నం 2.00 నుండి సాయంత్రం 5.30 వరకు
- అమ్మవారికి త్రిశతి అర్చన - సమయాలు: ఉదయం 8.00 నుండి 11.00 వరకు
- అన్ని వాహన లేదా వాహన పూజలు - సమయాలు: ఉదయం 8.30 నుండి సాయంత్రం 5.30 వరకు
- చండీ హోమం- ఇది ప్రతి శుక్రవారం మరియు పౌర్ణమి మరియు అమావాస్య రోజులలో జరుగుతుంది. జెంట్లకు మాత్రమే అనుమతి ఉంది. - సమయం: ఉదయం 9.30
- శుక్రవారం విశేష పూజ- శుక్రవారాల్లో మాత్రమే - సమయాలు: సాయంత్రం 5.00 నుండి 5.30 వరకు
- ఖడ్గమాల - సమయాలు: మధ్యాహ్నం 2.00 నుండి 4.30 వరకు
- కుంకుమార్చన - సమయాలు: ఉదయం 9.00 నుండి 11.30 వరకు మరియు మధ్యాహ్నం 2.00 నుండి సాయంత్రం 5.30 వరకు
- మహా నివేదన - సమయాలు: మధ్యాహ్నం 12 గం
- మాస కుంకుమార్చన - సమయాలు: ఉదయం 7.30 నుండి 11.00 వరకు
- నవగ్రహ పూజ - సమయాలు: ఉదయం 7.30 నుండి 11.00 వరకు
- మంగళవారం మరియు శుక్రవారం రేణుకా దేవి పూజ (మహిళలకు మాత్రమే) - సమయాలు: ఉదయం 7.30 నుండి 11.00 వరకు
- ప్రతి నెల మాస శివరాత్రి రుద్ర హోమం - సమయాలు: ఉదయం 9.00 గం
- శాశ్వత అభిషేకం - 10 సంవత్సరాలకు సంవత్సరానికి ఒకసారి - సమయాలు: ఉదయం 7.30 నుండి 11.00 వరకు మరియు మధ్యాహ్నం 2.00 నుండి సాయంత్రం 4.00 వరకు
శాశ్వత అన్నదానం మరియు విరాళం, శాశ్వత కుంకుమార్చన, శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామివారి స్పర్శ దర్శనం. చాలా పూజలు/సేవలకు 48 గంటల ముందుగానే బుకింగ్ చేసుకోవాలి.