Mahabharata in Gondi language. |
గోండీ భాషలో మహాభారతం… వనవాసీల కోసం ఓ ఉపాధ్యాయుడి పరిశ్రమ
గిరిజనులకు మహా భారతాన్ని చేరువ చేసేలా వారి భాషలోనే ఓ ఉపాధ్యాయుడు చేసిన ప్రయత్నం ఫలించింది. ఆదిలాబాద్ జిల్లా వాఘాపూర్ గ్రామానికి చెందిన తొడసం కైలాస్ ఇంద్రవెల్లి మండలంలో ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు.
మహా భారతంలోని కథలను చిన్నతనంలోనే తల్లిదండ్రుల వద్ద విన్నారు. దీనిని గోండు భాషలోకి అందివ్వాలని నిర్ణయించారు. దీంతో 18 పర్వాలను 272 పేజీలతో ‘‘పండోక్న మహాభారత్’’ పేరిట పుస్తకాన్ని రచించారు. మహా భారతంపై వనవాసీల్లో అమితమైన అభిమానం వున్నా… భాషా పరంగా ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. ఆ ఇబ్బందిని తొలగించడానికే దీనిని రాసినట్లు రచయిత తెలిపారు. ఈ కారణంగానే తెలుగు లిపిలోనే గోండు భాషలో దీనిని రచించారు. దీనిని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఇలా గోండు భాషలో రచించి, వనవాసీలకు మహా భారతాన్ని చేరువ చేశారని కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రచయిత కైలాస్ కృషి అభినందనీయమని ప్రశంసించారు.