Bath Puja to get rid of Mangal Dosha |
మధ్య ప్రదేశ్ ప్రవహించే షిప్రా నది మోక్షదాయిని శిప్రా నది అని కూడా అంటారు. షిప్రా నది తీరంలో వందలాది హిందూ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఈ కారణంగా ఆధ్యాత్మిక సంస్కృతికి నెలవుగా ఖ్యాతిగాంచింది. ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో ఉజ్జయని పేరుతో ప్రసిద్ధి చెందింది. పురాణాల ప్రకారం ఉజ్జయని అంగారకుడి జన్మస్థలం. అందువల్ల, మంగళ దోషం నుంచి ఉపశమనం పొందడానికి ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడ ఉన్న మంగళనాథ ఆలయానికి వస్తారు.
మంగళనాథ దేవాలయం పౌరాణిక చరిత్ర
మత్స్య పురాణం ప్రకారం మంగళనాథ లోనే అంగారకుడు జన్మించాడు. కథ ప్రకారం అంధకాసురుడు అనే రాక్షసుడు తన రక్తపు బిందువు పడితే ఆ రక్తం బిందువు నుంచి వందలాది అంధకాసురులు పుట్టే విధంగా శివుని నుండి వరం పొందాడు. ఈ వరం కారణంగా అంధకాసురుడు భూమిపై విధ్వంసం సృష్టించడం ప్రారంభించాడు. దీంతో దేవతలు, మునులు, ఋషులు తమను రక్షించమని అందరూ శివుడిని ప్రార్థించారు.
అంధకాసురుని దౌర్జన్యం నుంచి తమని కాపాడమంటూ శివుడిని వేడుకున్నారు. దీంతో శివుడు, అంధకాసురుడు మధ్య మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. ఈ యుద్ధం చేస్తున్న సమయంలో శివుడికి చెమటలు పట్టాయి. శివుని నుదుటి నుండి ఒక చెమట చుక్క నేలపై జారి అంగారకుడు జన్మించాడు. అంగారకుడు జన్మించిన వెంటనే ఆ రాక్షసుడి శరీరం నుండి బయటకు వచ్చిన రక్తపు బిందువులను స్వీకరించాడు. ఈ కారణంగా అంగారకుడి రంగును ఎరుపుగా పరిగణిస్తారని చెబుతారు.
Mangal Dosha - Bath Pooja |
మంగళనాథ రూపంలో శివయ్య
ఈ ఆలయం మంగళనాథ ఆలయం పేరుతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినప్పటికీ.. ఈ ఆలయంలో శివుడు మంగళనాథ రూపంలో ఉన్నాడు. ఆలయ గర్భగుడిలో శివుడు శివలింగ రూపంలో ప్రతిష్టించబడ్డాడు. ఉజ్జయిని నగరం జ్ఞానానికి సంబంధించిన గొప్ప కేంద్రంగా పరిగణించినా.. మహాకాళ ఆలయం, మంగళనాథ ఆలయం రెండూ కూడా ఖగోళ శాస్త్ర అధ్యయన కేంద్రాలుగా పరిగణించబడుతున్నాయి.
మంగళ దోష నుండి విముక్తి
విశ్వాసాల ప్రకారం ఈ ఆలయానికి ఎలాంటి అశుభకరమైన సంఘటననైనా మంగళకరమైనదిగా మార్చే శక్తి ఉంది. ఎవరి జాతకంలోనైనా మంగళదోషం ఉంటె.. అది పోగొట్టుకోవడానికి దేశ, విదేశాల నుంచి ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ మంగళశాంతి, దుష్కార్యాల నుంచి విముక్తి పొందేందుకు పూర్ణ క్రతువులతో పూజలు చేస్తారు.
భాత్ పూజ ప్రత్యేకం
మంగళనాథ దేవాలయంలో భాత్ పూజను నిర్వహిస్తారు. మంగళవారం నిర్వహించే ఈ భాత్ ప్రత్యేక పూజలో ఆలయంలో ప్రతిష్టించిన శివుని స్పెషల్ గా అలంకరిస్తారు. జాతకంలో మంగళ దోషం తొలగడం కోసం భక్తులు ఆలయంలో భాత్ పూజ చేస్తారు. భాత్ అనే ప్రత్యేక వంటకాన్ని తయారు చేసి స్వామివారికి సమర్పిస్తారు. ఈ వంటకంలో వివిధ సుగంధ ద్రవ్యాలు, కూరగాయలు ,నెయ్యితో వండిన అన్నం శ్రేయస్సు , అదృష్టాన్ని సూచిస్తుంది. అత్యంత పవిత్రమైన క్షిప్రా నది ఒడ్డున నెలకొని ఉన్నందున ఈ ఆలయ ప్రాముఖ్యత, అక్కడ జరిగే పూజలు మరింత విశిష్టను సంతరించుకున్నాయి. అంతే కాకుండా ఈ ఆలయంలో శని, రాహు, కేతు దోష నివారణలతో పాటు నవగ్రహ దోష నివారణ పూజలు కూడా నిర్వహిస్తారు.