శివ పూజ |
వర్జ్యం అంటే ఏమిటి ?
- వర్జ్య కాలం అంటే విడువ తగిన కాలం, అశుభ సమయం.
- అంటే వర్జ్యం వున్న సమయాన్ని విడిచిపెట్టాలని శాస్త్రం చెబుతోంది.
- వర్జ్యంలో ఎలాంటి శుభకార్యాలు ప్రారంభించడంగానీ, శుభకార్యాలకి బయలుదేరడం కాని చేయకూడదు.
- వర్జ్యంలో దైవకార్యాలు గానీ, శుభకార్యాలుగాని చేయకూడదని అంటూ వుంటారు కాబట్టి, ఆ సమయంలో దైవారాధనకి సంబంధించిన అన్ని పనులతో పాటు, శక్తి కొద్ది దానం కూడా చేయవచ్చని శాస్త్రం చెబుతోంది.
- వర్జ్యం వున్నప్పుడు దైవనామస్మరణ , పారాయణం , స్తోత్ర పఠనం , సంకీర్తన , భజనలు మొదలైనవి చేయవచ్చని శాస్త్రం చెబుతోంది.
ఈ విధంగా చేయడం వలన వర్జ్యం కారణంగా కలిగే దోషాలు ఏమైనా వుంటే అవి తొలగిపోతాయనే విషయాన్ని స్పష్టం చేస్తోంది.