జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్ష షష్ఠి రోజున శివపార్వతి దేవిల ముద్దుల తనయుడు స్కందుడిని (కార్తికేయ) నియమ నిష్టలతో పూజిస్తారు. కొన్ని ప్రాంతాలలో ఈ తిధిని స్కంద షష్ఠిగా కూడా జరుపుకుంటారు. ఈ షష్ఠిని సూర్య భగవానుని పూజించే రోజుగా కూడా పరిగణిస్తారు. ఈ రోజున సూర్యభగవానుని ఆరాధించడం ద్వారా ప్రజలు వ్యాధుల నుంచి విముక్తి లభించి, ఆరోగ్యం, ఆనందం, సంపదను పొందుతారు. సంతానం పొందాలనుకునే వారు ఈ రోజు షష్ఠి వ్రతాన్ని ఆచరిస్తారు.
స్కంద షష్ఠి రోజున ఇలా పూజించాలి :
- స్కంద షష్ఠి రోజున ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత ఉదయించే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి.. సూర్యుడికి సంబంధించిన మంత్రాలను జపించండి.
- ముందుగా గణేశుడిని, నవగ్రహాలను పూజించండి.
- కార్తికేయుని విగ్రహాన్ని ప్రతిష్టించి షోడశోపచార పద్ధతిలో పూజించండి.
- స్కంద షష్ఠి రోజున కార్తికేయ స్వామికి వస్త్రాలు, ఆభరణాలు, సువాసనలు, పువ్వులు, ధూపం, దీపం, నైవేద్యం మొదలైన వాటిని సమర్పించండి.
- కార్తికేయ భగవానుని ప్రసన్నం చేసుకోవడానికి హారతి ఇచ్చి పూజను ముగించండి.
- దీని తరువాత సుబ్రమణ్యస్వామిని ప్రార్ధించి కోరికను నెరవేర్చమని ప్రార్థించండి.
- పూజ సమయంలో “ఓం స్కంద శివాయ నమః” అనే మంత్రాన్ని జపించండి.
- కార్తికేయ భగవానుని హారతి పాడి ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించండి. అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేయండి.
- స్కంద షష్ఠి రోజున పేదలకు, ఆపన్నులకు అవసరమైన వస్తువులను దానం చేయండి.
ఈ ప్రత్యేక విషయాలపై శ్రద్ధ వహించండి
- స్కంద షష్ఠి వ్రతం సూర్యోదయ సమయంలో ప్రారంభమై మరుసటి రోజు సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించిన తర్వాత ముగుస్తుంది.
- షష్ఠి వ్రతం చేసే వారు ఈ రోజున పండ్లు తినండి. సూర్యాస్తమయం తర్వాత మాత్రమే ఆహారం తీసుకోండి.
- ఆరోగ్య సంబంధిత సమస్యలున్నవారు షష్ఠి వ్రతాన్ని ఆచరించడం వలన ఆరోగ్యంగా ఉంటారు.
- షష్ఠి వ్రతాన్ని ఆచరించే వ్యక్తి ఆ రోజున కొన్ని సుగంధ ద్రవ్యాలు, మాంసాహారం, మద్యపానం తీసుకోకూడదు.
స్కంద షష్ఠి అంటే ఏమిటి?
స్కంద షష్ఠి అంటే కార్తికేయుడిని పూజించే తిధి. శివ పార్వతుల తనయుడు ‘కార్తికేయ’, ‘సుబ్రమణ్యం’, ‘స్కంద’, ‘కుమార స్వామి’, ‘సుబ్రహ్మణ్య స్వామి ‘ వంటి వివిధ పేర్లతో పిలువబడుతున్నాడు. కార్తికేయుడు శివపార్వతిల తనయుడు. దేవ సైన్యానికి అధిపతి. షష్ఠి రోజున ఆయన్ని పూజించి, ఉపవాసం చేసే భక్తులపై కార్తికేయుడి అనుగ్రహం లభిస్తుందని.. కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం.