రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర మంగళవారం ప్రారంభమైంది. చాటింపుతో గంగమ్మ జాతరను తాతయ్య గుంట గంగమ్మ దేవస్థానం అధికారులు ప్రారంభించారు. తొమ్మిది రోజుల పాటు జరిగే జాతరలో రోజుకొక వేషధారణ ధరించి అమ్మవారికి భక్తులు మొక్కులు సమర్పించుకుంటూ ఉంటారు.
ఈనెల 15వ తేదీ బైరాగి వేషం, 16న బండవేషం, 17న తోటివేషం, 18న దొరవేషం, 19న మాతంగి వేషం, 20న సున్నపు కుండల వేషం, 21వతేదీన గంగమ్మజాతర జరుగనుంది. రాయలసీమ జిల్లాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వచ్చే భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు, తాగునీటి సౌకర్యాలను ఏర్పాటు చేశామని తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం అధికారులు తెలిపారు