- ఉట్టి గొడ్డుకి అరుపులెక్కువన్నట్లు.
- ఉట్టి గొడ్డుకి ఆకలెక్కువన్నట్లు.
- ఉపాయం లేని వాడిని ఊళ్ళోనంచి వెళ్ళగొట్టమన్నారు.
- ఉన్న మాటంటే ఉలుకెక్కువ.
- ఉన్నది పోయె ఉంచుకొన్నది పోయె.
- ఉయ్యాల్లొ పిల్ల పెట్టుకుని ఊరంతా వెతికినట్టు.
- ఉరుము ఉరిమి మంగలం మీద పడినట్లు.
- ఉల్లి చేసే మేలు తల్లికూడా చెయ్యదు.
ఊ
- ఊరు ఊరు పోట్లాడుకుని మంగలం మీద పడి ఏడ్చినట్టు.
- ఊపిరి ఉంటే ఉప్పుకల్లు అమ్ముకొని బ్రతకచ్చు.
- ఊపిరి పోతూంటే ముక్కులు మూసినట్లు.
- ఊరంతా ఉల్లి నీవెందుకే తల్లీ.
- ఊరంతా ఒకదారైతే ఉలిపికట్టెదొక దారి.
- ఊరు పొమ్మంటుంది కాడు రమ్మంటుంది.
- ఊరుకున్నంత ఉత్తమం లేదు బోడిగుండంత సుఖం లేదు.
- ఊళ్ళో పెళ్ళికి ఇంట్లో సందడి.
- ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావుడి.
- ఊరుకున్న శంఖాన్ని ఊది చెడగొట్టినట్లు.
- ఊరికి ఉపకారి ఆలికి అపకారి.
- ఊరికి చేసిన ఉపకారం శవానికి చేసిన శృంగారం వృథా.