శ్రీ సద్గురు త్యాగరాజ స్వామి |
ప్రారంభమైన శ్రీ సద్గురు త్యాగరాజ స్వామి జయంత్యుత్సవాలు
శ్రీ సద్గురు సంగీత సభ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్వహించే సద్గురు త్యాగరాజ స్వామి 247 వ జయంతి ఉత్సవాలు విజయవాడ శ్రీ శృంగేరీ పీఠపాలిత శివరామకృష్ణ క్షేత్రంలో సోమవారం ప్రారంభమయ్యాయి. ఉత్సవాలను సంగీత సభ ప్రధాన కార్యదర్శి పోపూరి గౌరీనాథ్ ప్రారంభించారు.
త్యాగరాజ స్వామి తన సంకీర్తనల ద్వారా రామభక్తి సామ్రా జ్యాన్ని స్థాపించి సంగీతం ద్వారా ముక్తిని పొంద వచ్చునని చాటారని తెలిపారు. ప్రతి ఏటా త్యాగరాజ స్వామి జయంతి ఉత్సవాలను ఘనం గా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రారంభ కార్య క్రమంలో సంగీత విద్వాంసురాలు గాయత్రి గౌరీనాథ్, శివరామకృష్ణ క్షేత్రం ధర్మాధికారి శిష్ట్లా హనుమత్ ప్రసాద్, సంగీత సభ ఉపాధ్యక్షుడు బి.హరిప్రసాద్ పాల్గొన్నారు. ఉదయం త్యాగరాజ స్వామికి పూజాదికాలు నిర్వహిం చారు. సంగీత కార్యక్రమాలు నాద స్వరంతో ప్రారంభమయ్యాయి. హరికథా విద్వాంసుడు ముప్పవరపు సింహాచల శాస్త్రి త్యాగరాజ స్వామి చరిత్రను హరికథా గానం చేశారు భమిడిపాటి శ్రీలలిత, హంసిని, నిడమర్తి లోహిత దత్తా త్యాగరాజ స్వామి కృతులను ఆలపించారు.