కోరుకున్న వారికి కొంగు బం గారమై భక్తుల పాలిట కల్పవృక్షంగా విలసిల్లుతు న్నారు శ్రీభ్రమరాంబ సమేత చెన్న మల్లేశ్వర స్వామి. కృష్ణాజిల్లా పామర్రు మండలం ఎలకుర్రు గ్రామంలో ఉన్న శ్రీభ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి ఆలయానికి 264 ఏళ్ల పైబడి చరిత్ర ఉంది
ఈ నెల 18 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ఈ నెల 18 నుంచి 23వ తేదీ వరకు ఆలయ 264వ వార్షిక కల్యాణ మహోత్సవాలను నిర్వహించను న్నట్లు ఆలయ వ్యవస్థాపక కుటుంబ ధర్మకర్త కాశీ నాథుని నాగేశ్వరరావు సోమవారం తెలిపారు. ఈ నెల 18 వ తేదీన ధ్వజారోహణం. చిన్నాపురం వాస్తవ్యుడు జన్ను నారాయణరావు సమర్పించు సిద్ధు ఆదంబి సంవాదం నాటకం ఉంటుందన్నారు. 19 న వేద పఠనం, సహస్ర నామార్చన, హరికథా
కాలక్షేపం, రాత్రి 9 గంటలకు వేదాంతం రాదే శ్యామ్ బృందం వారి భక్త ప్రహ్లాద నాటకం ఉంటుందన్నారు.
మే 20 న హరికథా కాలక్షేపం, రాత్రి 7 గంటలకు విశ్వదాత కల్చరల్ ఫౌండేషన్ వారిచే విశ్వదాత అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంద న్నారు. 21న వేద పఠనం, రాత్రి 7గంటలకు జగజ్యోతి, రాత్రి 9 గంటలకు భ్రమరాంబ చెన్న మల్లేశ్వర నాట్యమండలి, మాచిరాజు రాధాకృష్ణ సమర్పించు సత్య హరిశ్చంద్ర నాటకం ఉంటుంద ని, రాత్రి 2 గంటలకు స్వామివారి కల్యాణ మహో త్సవం జరుగుతుందన్నారు. మే 22 ఉదయం హరి కథా కాలక్షేపాలు, రాత్రి 9 గంటలకు వీరభద్రస్వామి వీధిపళ్లెం కార్యక్రమం, 10 గంటలకు స్వామివారి రథోత్సవం ఉంటుందన్నారు. మే 23న స్వామివారి త్రిశూల స్నానం, రాత్రికి ఏకాదశ ప్రదక్షిణలు, పవళింపు సేవ అనంతరం మహా అన్న సమారాధన నిర్వహిస్తున్నట్లు తెలిపారు