అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలో హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో బుధవారం శ్రీహనుమాన్ శోభాయాత్ర సోసైటీ కాలనీలోని స్థానిక శ్రీరామాలయం నుంచి మొదలై కన్నుల పండుగలా సాగింది. ఇందులో భాగంగా జరిగిన బైక్ ర్యాలీలో వందలాదిగా పాల్గొని హిందువులు ఐక్యతను చాటి చెప్పారు.
హనుమాన్ జన్మదినాన్ని పురస్కరించుకొని పట్టణ పురవీధుల్లో శోభా యాత్ర (బైక్ ర్యాలీ) ముందుకు సాగింది. ఇందులో అగ్రభాగాన హనుమంతుడి విగ్రహ ఊరేగింపులో భక్తులు స్వామి వారిని దర్శించుకొని పూజలు చేశారు. శోభాయాత్రలో పుర యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు.
తాను నమ్మిన దైవం,ధర్మం కోసం ఏదైనా సమర్పించే శ్రీహనుమాన్ జన్మదినోత్సవ సందర్భంగా ధర్మాచార్యుల మార్గదర్శకంలో ఈ బైక్ ర్యాలీలో పాల్గొనడం జరిగిందని అధ్యక్షులు ప్రాంత సంయోజక్ పిన్నం వెంగళరావు,రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ బయ్యా వాసులు పేర్కొన్నారు. హిందువులుగా తరలివచ్చి హనుమాన్ శోభాయాత్రను జయప్రదం చేసిన అందరికి కృతజ్ఞతలు తెలిపారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టశ్వర్యాలతో ఉండాలని,సకాలంలో వర్షాలు పడి పాడిపంటలతో అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ ర్యాలీలో బిజెపి అన్నమయ్య జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్, వరదారెడ్డి నారద రెడ్డి, బండి బాలాజీ, జర్మన్ రాజు, బండి ఆనంద్, దారం అనిత తదితరులు పాల్గొన్నారు.