Samāsālu |
సమాసాలు - (విగ్రహ వాక్యాలు)
సమాసాలు - (విగ్రహ వాక్యాలు)
పదము | విగ్రహ వాక్యము | సమాసము పేరు | |
1 | వేద శాఖలు | వేదముల యొక్క శాఖలు | షష్టి తత్పురుష సమాసము |
2 | వృక్ష వాటిక | వృక్షముల యొక్క వాటిక | షష్టి తత్పురుష సమాసము |
3 | ఆది కావ్యము | ఆది యైన కావ్యము | విశేషణ పూర్వపద కర్మ ధారయ సమాసము |
4 | నవ రసములు | తొమ్మిది సంఖ్య గల రసములు | ద్విగు సమాసము |
5 | ధీర పురుషులు | ధీరులైన పురుషులు | విశేషణ పూర్వపద కర్మ ధారయ సమాసము |
6 | ఎండ వానలు | ఎండ మరియు వానలు | ద్వంద్వ సమాసము |
7 | తల్లి తండ్రులు | తల్లి మరియు తండ్రి | ద్వంద్వ సమాసము |
8 | దశావతారాలు | పది సంఖ్య గల అవతారాలు | ద్విగు సమాసము |
9. | జీవిత గమనం | జీవితం యొక్క గమనం | షష్టి తత్పురుష సమాసము |
10. | వెయ్యి రూపాయలు | వెయ్యి సంఖ్య గల రూపాయలు | ద్విగు సమాసము |
11. | మంచి పేరు | మంచిదైన పేరు | విశేషణ పూర్వపద కర్మ ధారయ సమాసము |
12. | మూడు అంశాలు | మూడు సంఖ్య గల అంశాలు | ద్విగు సమాసము |
13. | ఆలోచన స్పష్టత | ఆలోచన యొక్క స్పష్టత | షష్టి తత్పురుష సమాసము |
14. | మంద బుద్ధి | మందమైన బుద్ధి | విశేషణ పూర్వపద కర్మ ధారయ సమాసము |
15. | జీవధనములు | జీవమును, ధనమును | ద్వంద్వ సమాసము |
16. | యువతీయువకులు | యువతియు, యువకుడును | ద్వంద్వ సమాసము |
17. | దశదిక్కులు | దశ సంఖ్య గల దిక్కులు | ద్విగు సమాసము |
18. | భూత ప్రేతములు | భూతమును, ప్రేతమును | ద్వంద్వ సమాసము |