ఇ
- ఇంటికన్నా గుడి పదిలం.
- ఇంట్లో పిల్లి వీధిలో పులి.
- ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య.
- ఇంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చినట్టు.
- ఇద్దరు ముద్దు ఆపై వద్దు.
- ఇద్దరే సత్పురుషులు, ఒకడు పుట్టనివాడు, ఇంకొకడు గిట్టినవాడు.
- ఇరుపోటీలతోటి ఇల్లు చెడె, పాత నొప్పులతోటి ఒళ్ళు చెడె.
- ఇల్లలకగానే పండగకాదు.
- ఇల్లలుకుతూ పేరు మర్చిపోయినట్లు.
- ఇల్లు ఇచ్చినవాడికి, మజ్జిగ పోసినవాడికి మంచిలేదు.
- ఇల్లు ఇరుకుగా ఉండాలి, పెళ్ళాం చండాలంగా ఉండాలి.
- ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే,వల్ల కాలేదని ఒకడు ఏడ్చాడంట.
- ఇల్లు కాలి ఒకరు ఏడుస్తుంటే ఏదో కావాలని ఎవడో ఏడ్చాడట.
- ఇల్లుకాలి ఒకడేడుస్తుంటే, చుట్టకి నిప్పు అడిగాడంటొకడు.
- ఇల్లు ఇరకాటం ఆలి మర్కటం.
- ఇల్లు పీకి పందిరి వేసినట్లు.
- ఇసుక తక్కెడ పేడ తక్కెడ.
- ఇల్లలకగానే పండగ కాదు.
- ఇంటి ముందు ములగ చెట్టు వెనుక వేప చెట్టు ఉండరాదు.