గంగాదేవి |
గంగా సప్తమి సనాతన ధర్మంలో అత్యంత పవిత్రమైన రోజుల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ రోజున గంగామాతను పూజిస్తారు.
హిందూ పంచాంగం ప్రకారం ఈ పండుగను ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలోని సప్తమి తిథి నాడు జరుపుకుంటారు. ఈ రోజున గంగాదేవిని పూజించడం వల్ల కోరుకున్న వరుడు లభిస్తాడని, పాపాలు నశిస్తాయన్న నమ్మకం.
గంగా సప్తమి రోజును గంగామాత జన్మదినంగా జరుపుకుంటారు. ఈ పండుగ ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలో ఏడవ రోజున వస్తుంది. ఈ రోజున గంగామాత బ్రహ్మదేవుని కమండలం నుంచి ఉద్భవించిందని నమ్మకం. హిందూ మతంలో ఈ రోజుకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ సంవత్సరం గంగా సప్తమి ఎప్పుడు? ఈ రోజున పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం.
గంగా సప్తమి 2024 సమయం
వైదిక పంచాంగము ప్రకారం వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలోని సప్తమి తిథి మే 13, 2024న సాయంత్రం 5:20 గంటలకు ప్రారంభమవుతుంది.. మర్నాడు అంటే మే 14, 2024 సాయంత్రం 6:49 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథిని పరిగణలోకి తీసుకుని ఈ సంవత్సరం గంగా సప్తమిని మే 14, 2024న జరుపుకుంటారు.
ఈ ఐదువస్తువులు హనుమంతునికి సమర్పించండి అద్భుత ప్రయోజనాలు మీ సొంతం
గంగా సప్తమి పూజ విధి:
- ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి పవిత్ర గంగా నదిలో స్నానం చేయాలి.
- గంగాదేవికి పూలమాల సమర్పించండి. ఇంట్లో తయారుచేసిన స్వీట్లను సమర్పించండి.
- ఆ తర్వాత గంగామాతకు హారతిని ఇవ్వండి. గంగా సప్తమి రోజున దీపాలను దానం చేయడం ఒక ఆచారంగా భావిస్తారు.
- ఈ రోజున, పవిత్ర గంగా నది ఒడ్డున జాతరలు నిర్వహిస్తారు.
- గంగా సప్తమి రోజున గంగా సహస్రనామ స్తోత్రం, గాయత్రీ మంత్రాన్ని పఠించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.
- గంగా సప్తమి రోజున ఎలాంటి తామసిక వస్తువులను తీసుకోవద్దు.
- వీలైనంత ఎక్కువ భక్తిపరమైన పనిని కొనసాగించాలి. అంతేకాదు ఈ రోజున శివ, విష్ణువులను పూజించడం వల్ల కూడా ఫలితం ఉంటుంది.
గంగా సప్తమి పూజ మంత్రం
‘ఓం నమో గంగాయై విశ్వరూపిణీ నారాయణి నమో నమః గంగా గంగా’ అని వందల యోజనాల వరకు వినిపించేలా మంత్రాన్ని చెప్పేవాడు. సర్వపాపముల నుండి విముక్తుడై విష్ణులోకానికి వెళతాడు
గంగా సప్తమి ప్రాముఖ్యత
గంగా సప్తమి రోజున గంగా నదిలో స్నానం చేయడం వల్ల జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ తొలగిపోయి సంపదలు చేకూరుతాయని చెబుతారు. దీంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ రోజున గంగా నదిలో స్నానం చేయలేకపోతే స్నానం చేసే నీటిలో కొన్ని చుక్కల గంగాజలం వేసి అందులో గంగామాతను ఆరాధించండి. ఇలా చేయడం వల్ల గంగా నదిలో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయని చెబుతారు. ఈ రోజున గంగాపూజతో పాటు దానధర్మాలు చేయడం కూడా ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇలా చేయడం ద్వారా మనిషి జీవితంలో అన్ని రకాల సుఖాలను పొందుతాడు.