కన్యారాశి |
కన్యారాశి, రాశిఫలాలు
- ఆదాయం 5, వ్యయం 5
- రాజపూజ్యం 5, అవమానం 2
మీ పేరులోని మొదటి అక్షరం టా, పా, పీ, పూ, షా, క్షే, ఠా, పే, పో - లలో అయిననూ, లేక మీరు ఉత్తర 2, 3, 4, పాదాలు; హస్త 1,2,3,4 పాదాలు; చిత్త 1,2 పాదంలో జన్మించివుంటే మీది కన్యారాశి.
కన్యారాశివారికిఈ ఏడాది మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. ఆర్థికంగా బాగానే ఉంటుంది. కుటుంబంలో కూడా పరిస్థితులు బాగుంటాయి. సోదరలో బంధువులు సహకరిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు బాగా సాగుతాయి. వృత్తిపరంగా అధికారుల ప్రశంసలు పొందుతారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆకస్మిక ధనలాభం వుంటుంది. ఆరోగ్యం దెబ్బతినగలదు. శ్రమ ఎక్కువగా వుంటుంది. కాళ్ళ నెప్పులు వచ్చే అవకాశం వుంది. బాకీలు వసూలు కావడం కష్టమే. విద్యార్థులు, డాక్టర్లు, లాయర్లు, ఇంజినీర్లు మెరుగైన ఫలితాలు పొందడానికి మరింత శ్రమపడాలి. మధ్యవర్తులను నమ్మకండి. సంవత్సరాంతంలో అన్ని రంగాలవారికీ బాగుంటుంది.
జనవరి: మీ తెలివితేటలు పది మందికీ తెలిసొస్తుంది. నూతన కార్యాలు ప్రారంభిస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాత్రావరణం వుంటుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. పలుకుబడి పెరుగుతుంది. రాబడికి మించి ఖర్చులు ఉంటాయి. ప్రయాణాలలో జాగ్రత్త, ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఆస్తికి సంబంధించిన చర్చలలో మెలకువతో వ్యవహరించండి.
ఫిబ్రవరి: నూతన వ్యక్తులు పరిచయమవుతారు. వ్యాపారంలో మార్పులు, చేర్చులు చేస్తారు. పెట్టుబడులు పెడతారు. గౌరవం పెరుగుతుంది. విందులు, వినోదాలకు వెళ్తారు. ఇతరులకు సహాయపడుతారు ఆశించినంత లాభాలు రాకపోవచ్చు. పిల్లల చదువులో శ్రద్ధ అవసరం వుంది.
మార్చి: ఆర్థిక లావాదేవీలు ప్రోత్సావాన్నిస్తాయి. లాభసాటి బప్టందాలు కదురుతాయి. ఓ మంచి కబురు మిమ్మల్ని ఆశ్చర్యంలో, ఆనందంలో ముంచేస్తుంది. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. దేవాలయాలు దర్శిస్తారు. స్టేహితులకు సహకరిస్తారు. మనసు హాయిగా ప్రశాంతంగా వుంటుంది.
ఏప్రిల్: దూర ప్రయాణాలు చేయవలసివస్తుంది. సకాల భోజనం, రుచికరమైన ఆహారం తీసుకుంటారు. అవకాశాలు కలిసివస్తాయి. కృషికితగ్గ ఫలితం ఉంటుంది. కవులకు, కళాకారులకు పురస్కారాలు లభించగలవు. ప్రభుత్వోద్యోగాలు కొందరికి పదోన్నతి కలుగుతుంది.
మే: వృత్తిపరంగా అభివృద్ధి వుంటుంది. పనులన్నీ జయప్రదంగా సాగుతాయి. అవసరానికి పైకం అందుతుంది. బాధ్యతలు ఎక్కువౌతాయి. దూరప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. మంచి అవకాశాలు వస్తాయి. కాంట్రాక్టులు సంతృప్తిని ఇస్తాయి. శారీరక శ్రమమాత్రం ఎక్కువగా ఉంటుంది.
జూన్: ఉద్వోగంకోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. దూరప్రాంతంనుండి కానుకలు వస్తాయి. ఇంట్లో శుభకార్యం చేపడతారు. వాయిదాపడుతున్న ఫనులు, పూర్తిచేస్తారు. వ్యాపారం బాగా సాగుతుంది ఆధ్యాత్మిక చింతన ఎక్కువౌతుంది. కుటుంబ సభ్యులతో స్పర్థలు, కలవోలు తలెత్తకుండా జగ్రత్తపడండి. వివాదాలు, విమర్శలను సమన్వయంతో ఎదుర్కోవడం ఉత్తమం.
జూలై: కుటుంబ వాతావరణం మెరుగుపడుతుంది. ఇంట్లో జరిగే మార్చులు సంతృప్తి కలిగిస్తాయి. సుఖసంతోషాలు లభిస్తాయి. ధనలాభం చేకూరుతుంది. విద్యార్ణులకు మంచి విజయాలు ఎదురుచూస్తున్నాయి. ఆరోగ్యం మందగిస్తుంది. ఇతరుల విషయంలో అనవసరంగా తలదూర్చకండి. ఇష్టస్త్రీతో మృదువచనములు, సంతోషముగా, ఉల్లాసముగా వుంటారు.
ఆగస్ట్: ధనలాభం వుంది. వస్తువులు, స్వర్ణాభరణాలు కొంటారు. పట్టుదలతో పనులు పూర్తి చస్తారు. ముఖ్యమైన వృక్తిని కలుస్తారు. తీపికబురు వింటారు. ప్రయాణాలవల్ల లాభం పొందుతారు. అనారోగ్య సమస్యలు ఎదురౌతాయి. ముఖ్యంగా కళ్ళ ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించండి.
సెప్టెంబర్ : సమాజంలో మంచి గుర్తింపు వస్తుంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. ముఖ్మిమైన విషయంలో ఆచితూచి నిరయం తీసుకోవడం మంచిది. తలపెట్టిన పనులు పూర్తిచేస్తారు.
అక్టోబర్ : సన్నిహితులను కలుస్తారు. ప్రయాణాలు పెట్టుకుంటారు. ప్రయాణాలు ఒకింత లాభాన్నే తెస్తాయి. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఐతే కఠినంగా మాట్లాడడంవల్ల కొన్ని సమస్యలు కొనితెచ్చుకుంటారు. తద్వారా చిరాకు, అశాంతి ఏర్పడతాయి. పంతాలకు వెళ్ళకండి. ఆస్తి విషయంలో మోసానికి గురికాకుండా జాగ్రత్త పడండి మీ పై కొందరు నిందలు మోపుతారు,
నవంబర్ : ముఖ్యమైన వార్త వింటారు. కుటుంబ పరిసితులు సంతృప్తికరంగా ఉంటాయి. అప్పలు తీరుస్తారు. ఐతే తలపెట్టిన కార్యాలకు ఆటంకాలు ఎదురౌతుంటాయి. ఇతరులు మీపై నిందలు వేస్తారు. శారీరక శ్రమ ఎక్కువౌతుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోక తప్టకపోవచ్చ.
డిసెంబర్ : ఆర్థిర పరిస్థితి మరింత బాగుంటుంది. ఊహించని మార్చులు జరగవచ్చు. శుభ కార్యాలు సులభంగా నెరేవేరగలవు. ఆస్తి విషయంలో లావాదేవీలు మీకు అనుకూలంగా ముగుస్తాయి. ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాలు ఒకింత శ్రమ కలిగించినా చెప్పకోదగ్గలాభాలు చేకూరుస్తాయి. స్థిరమైన నిర్ణయాలు తీసుకోగలరు. ఆరోగ్య సమస్యలు అధికమౌతాయి.