ఆది శంకరాచార్యులు |
12న ఆదిశంకరుల జయంతి ఉత్సవం
శృంగేరీ పీఠపాలిత శివరామ కృష్ణ క్షేత్రంలో శృంగేరీ పీఠాధిపతులు భారతీ తీర్థ మహా స్వామి విదుశేఖర భారతి ఆదేశాలతో శివరామ క్షేత్రంలో ఈ నెల 12వ తేదీ ఆదివారం ఆదిశంకరుల జయంతి ఉత్సవాలు నిర్వహిస్తునట్లు ధర్మాదికారి శిష్ట్లా హనుమత్ ప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఆరోజు ఆదిశంకరులకు ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక వేత్త శ్రీపాద సుబ్రహ్మమణ్యశాస్త్రితో ఆదిశంకరులు రచించిన ప్రస్తాన త్రయ భాష్యం, బ్రహ్మసూత్రములు, శ్రీమద్ భగవద్గీత ఉపనిషత్గాతులు అంశగా ప్రసంగాలు ఉంటాయని పేర్కొన్నారు. 18వ తేదీ అదిశంరుల చిత్రపటంతో శోభాయాత్ర నిర్వహిస్తు న్నట్లు తెలిపారు.
శారదా చంద్ర మౌళేశ్వర స్వామి దేవస్థానంలో..
కృష్ణామండల వేద విద్వత్ ప్రవర్దక సభ ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీ నుంచి మూడురోజులపాటు శంకర జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వేద సభ అధ్యక్షుడు మాగంటి వేణుగోపాల్, దేవాలయ మేనేజర్ శర్మ సోమవారం. ఒక ప్రకటనలో తెలిపారు. 10, 11, 12 తేదీల్లో వేద విద్యార్థులకు పరీక్షలు, 76వ వేద సభ వార్షిక సమావేశాలు, నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముగింపు సభలో తిరుపతి వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి శ్రీ రామకృష్ణమూర్తి, దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి కేఎస్ రామరావు పాల్గొంటారని తెలిపారు.